ప్రపంచంలో ఇప్పుడు కరోనా విజృంభన రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  కరోనా పై ఎంత జాగ్రత్త ఉంటే అంత మేలు అని అంటున్నారు.  మరో వైపు  కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది కృషిని అభినందిస్తున్నారు. సహాయం చేసిన వారి పేర్లను తమ బిడ్డలకు పెట్టుకుంటున్నారు. తాజాగా యూపీలో వివిధ గ్రామాల్లో పుట్టిన శిశువులకు కరోనా..లాక్ డౌన్ పేర్లు పెట్టుకోవడం వైరల్ అయ్యింది. 

 

వివరాల్లోకి వెళితే..  దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో ఓ మాతృమూర్తి.. పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబుకు ఏ పేరు పెట్టాలని ఆలోచించసాగారు.  ఈ సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్ అమల్లో ఉంది.. ఈ సందర్భంగా అందరూ ఇంటి పట్టున ఉంటున్నారు.  ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో ఈ పరిస్థితులు ఎదురుయ్యాయి.  లాక్ డౌన్ తో ఇంటి పట్టున ఉంటున్న నేపథ్యంలో తమ బిడ్డకు లాక్ డౌన్ పేరు పెడితే ఎప్పటి కీ గుర్తుండి పోతుందని ఆ పేరు పెట్టారు.  ఈ సందర్భంగా బాబు తండ్రి పవన్ మాట్లాడుతూ..తమకు లాక్ డౌన్ కాలంలో బాబు జన్మించాడని చెప్పారు.

 

ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారని విషయాన్ని గుర్తు చేశారు. ఇదే రాష్ట్రంలోని (ఉత్తర్ ప్రదేశ్) ఘోరక్ పూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మహిళ గర్భవతి.  ఈ మద్య ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది.  ఆ మద్య కరోనాని అరికట్టేందుకు ప్రధాని మెదీ ఆ మద్య జనతా కర్ఫ్యూ పాటించాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా పాప పుట్టడంతో ఆ పాపకు కరోనా అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: