కలలో కూడా కలవరపెడుతున్న ఈ
కరోనా మహమ్మారి మన దేశంలో రోజు రోజుకు పెరిగిపోతోంది . దీని వ్యాప్తికి ఎల్లలు లేకుండా పోయాయి . ప్రపపంచంలో అన్ని దేశాలు దీని భారీన పడ్డాయి. కొన్ని దేశాలు దీని నియంత్రణ మావల్ల కాదు అని చేతులెత్తేశాయి దీని రాకాసికోరలకు వైద్యమందించే డాక్టర్లు కూడా చిక్కుతున్నారు .
తాజాగా మన దేశంలో 1446 మంది
కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 133 కేసులు డీఛార్జి అయ్యాయి మరియు 38 మంది చనిపోయారు . ఇప్పటివరకు ఢిల్లీలో వందకు పైగా
కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు .
.
తాజా గా ఢిల్లీనుండి అందుతున్న సమాచారం ప్రకారం
ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్ లో పని చేస్తున్న ఓ
డాక్టర్ కి
కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రభుత్వం నిర్ధారించింది . దీంతో హాస్పిటల్ మూసివేసింది
ఢిల్లీ ప్రభుత్వ. ఆ డాక్టర్
క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నట్లుగా సమాచారం .
డాక్టర్ మరియు హాస్పిటాల్ సిబ్బంది యొక్క రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు , ఆ
డాక్టర్ యొక్క తమ్ముడు తమ్ముడి
భార్య ఇటీవల యుకె నుంచి వచ్చారని వారి నుంచి ఆయన కు వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు