
చైనాలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కొద్దిరోజులుగా కొత్త కరోనా కేసులేమీ నమోదు కాకపోవడంతో చైనా ఊపిరి పీల్చుకుంది. కానీ అక్కడ మళ్లీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా వైరస్ వల్ల మరణాలు సంభవించడంతో అక్కడి ప్రజలను మరింత కలవర పెడుతోంది. తాజాగా మెయిన్‌ల్యాండ్ చైనాలో కొత్తగా 31 కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. అందులో ఇద్దరికి స్థానికంగా కరోనా వైరస్ సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. అంతేకాకుండా 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్‌తో పోరాడుతూ నలుగురు మృతి చెందారు. దాంతో అక్కడి ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు.
ఇప్పటికే చైనాలో 81,322 మందికి కరోనా వైరస్ సోకగా, వారిలో 3,322 మంది ప్రాణాలను కోల్పోయారు. దాదాపు మూడు నెలలు తర్వాత కూడా చైనాలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గక పోవడంతో చైనా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దాంతో చైనా ప్రభుత్వం వేరే దేశాల వారిని తమ దేశంలోకి రావొద్దని హెచ్చరించింది. విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం విధించింది. కరోనా వైరస్ మరింత విజృంభిస్తున్న కారణంగా చైనాలోని షెన్‌జెన్ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములతో పాటు రక్షిత వన్యప్రాణులను తినడాన్ని నిషేధం. పాములు, బల్లులు, పిల్లులు, కుక్కలతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగంపై షెన్‌జెన్‌లో నిషేధం విధించడం ఇదే మొదటిసారి.
అయితే ఈ మహమ్మారి పుట్టిన వూహాన్‌లోని మార్కెట్ మళ్లీ తెరుచుకున్నప్పుడే ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే అక్కడ అన్ని రకాల జంతువుల మాంసం విక్రయించడం వల్ల, వాటిని తినడం కోసం చైనీయులు క్యూ కట్టారు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఇతర దేశాల వారు చైనాను తిట్టి పోస్తూన్నారు. ఇప్పటికైనా చైనా మేలుకుని, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle