ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయి. పాకిస్థాన్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే పాక్ లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నిన్నటివరకు పాక్ లో 2,238 మంది కరోనా భారీన పడ్డారు. 31 మంది చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశంలో లాక్ డౌన్ ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. 
 
ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆంక్షలను విధించినప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఆంక్షలను లెక్క చేయకపోవడంతో బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాక్ డౌన్ ప్రకటిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని, దేశంలో ఆహార కొరత ఏర్పడుతుందని అందువల్లే ప్రజలే నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. 
 
తగినంత స్థాయిలో స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడం, క్వారంటైన్ కేంద్రాలలో సౌకర్యాల లేమిని బట్టి పాక్ కరోనాను కట్టడి చేయడానికి ఎంత కృషి చేస్తుందో సులభంగానే అర్థమవుతుంది. దేశంలో మరికొన్ని రోజుల్లో ఊహించని స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతాయని వస్తున్న వార్తలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నా పాక్ లో ఇప్పటికీ మసీదులు మూతబడలేదు. 
 
పాక్ దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉండటంతో అక్కడ మెజారిటీ వర్గాలకు మాత్రమే రేషన్ ఇస్తోందని మైనారిటీ వర్గాలకు ఇవ్వడం లేదని తెలుస్తోంది. దేశంలో కొన్ని స్వచ్చంద సంస్థలు మైనారిటీలకు రేషన్ ఇస్తున్నా వారిని కూడా అడ్డుకుంటోందని తెలుస్తోంది. పాక్ ప్రభుత్వం మాత్రం దేశంలో అలాంటి ఇబ్బందులు లేవని... పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెబుతూ ఉండటం గమనార్హం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: