ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలలో పని చేసే క్షురకులను ఆదుకోవాలని నిర్ణయించారు. వీరికి 10,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం సూచనల మేరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాలయాల్లో పని చేసే క్షురకులకు 10,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. 
 
రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల దేవాలయాలు మూసి ఉన్న నేపథ్యంలో క్షురకులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 968 మంది వివిధ దేవాలయాలలో సేవలు అందిస్తున్నట్లు ప్రకటన చేశారు. దేవాలయాల మూసివేత వల్ల వీరు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. కేశ ఖండన శాల జేఏసీ కూడా వీరిని ఆదుకోవాలని కోరారు. 
 
ప్రభుత్వం క్షురకుడు పని చేసే దేవాలయం నుంచే వారికి 10,000 రూపాయలు అడ్వాన్స్ గా చెల్లిస్తుందని పేర్కొన్నారు. క్షురకులు లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం వారి పరిస్థితులు చక్కబడిన తరువాత నగదును జమ చేయవచ్చని పేర్కొన్నారు. క్షురకులు అవసరమైతే సులభ వాయిదాల్లో నగదును జమ చేయవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 968 మంది క్షురకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లబ్ధి పొందుతున్నారని చెప్పారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు తొలి మరణం నమోదైంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 161 కరోనా పాజిటివ్ కేసులను గుర్తించారు. వీరిలో ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 154 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈరోజు రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల తరువాత కొత్త కేసులు నమోదైతే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: