దేశంలో కరోనా వైరస్ ని అరికట్టడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే కొంత మంది జనాలు మాత్రం ఈ లాక్ డౌన్ అస్సలు పాటించడం లేదు.  ప్రతిరోజూ ఏదో ఒక కారణం చెప్పి లాక్ డౌన్ ఉల్లంఘన చేస్తున్నారు.  అయితే కొన్ని చోట్ల పోలీసులు నచ్చజెబుతున్నారు.. మరికొన్ని చోట్ల లాఠీకి పని చెబుతున్నారు.   ఈ సమయంలో కొంత మంది యువకులు ఆకతాయి చేష్టలతో పోలీసులకు తలనొప్పిగా మారారు. అలాంటి వారిపై కన్నేసి ఉంచడానికి హైదరాబాద్ పోలీసులు అత్యాధునిక సాంకేతికను వాడుకుంటున్నారు.

 

 లాక్‌డౌన్‌ను పర్యవేక్షించడానికి హైదరాబాద్ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు.  కొన్ని కాలనీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.. అయితే వీటి తో పోలీసలు మంచి ఫలితాలనే   రాబడుతున్నారు.   డ్రోన్ల సహాయంతో ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం తెలిసిపోతుంది.  ఇళ్లలోంచి బయటకి వస్తున్న వారిని గమనించడానికి సయంట్  డ్రోన్ బేస్‌డ్ టెక్నాలజీ వాడుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.

 

 

థెర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ విధానాన్ని కూడా ప్రభావవంతంగా వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 25 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశారు.  కంప్యూటర్ తెరలపై ఎప్పటికప్పుడు గమనిస్తూ కాలనీలలో వాలి పోతున్నారు. అలుపెరుగని సేవ చేస్తూ కరోనా కట్టడిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: