అమ్మ...! కళ్ళలో కన్నీటిని దాచి, పెదాలతో సంతోషాన్ని  చూపేది అమ్మ. ఎంత బాధ ఉన్నాగాని తట్టుకుని, తన ఊపిరి ఆగిన,  మరో ఊపిరిని నిలబెట్టేది అమ్మ.పురిటి నొప్పులను సైతం   ఆనందంగా  బరిస్తుంది. అందుకేనేమో  దేవుడు ఈ విశ్వకోటిలో సకల ప్రాణులకు అమ్మను స్రుష్టించాడు,అమ్మ ప్రేమను రుచి చూపించాడు.  మన చిన్నపుడు మన కోసం అమ్మ చేసిన పనులు కొన్ని తలుచుకుంటే ఇప్పటికి మన మనసు ఆత్మీయతతో నిండిపోతుంది. అవి గుర్తుకువచ్చి  ఒక్కసారిగా మనం  చిన్నపిల్లలం అయిపోతాము. 

 

మన  పుట్టిన రోజు నాడు అమ్మ తీసిన ఎర్ర నీళ్ళ హారతి మరచిపోగలమా,కొనిచ్చిన కొత్తబట్టలను మరచిపోగలమా?బడికి వెళ్ళెముందు అమ్మ చేతిలో పెట్టిన తాయిలం గుర్తుఉందా ,బొమ్మలుకొనుక్కోడానికి పోపుల పెట్టి నుండి తీసిచ్చిన చిల్లర కాసులు మరచిపోగలమా?మూతి పట్టుకొని తలదువ్వడం,పౌడరు పూయడం,అలసిన నీకు తన చీరకొంగుతో చెమట తుడవడం మరచిపొగలమా?సాయంత్రంవేళ అరుగుపైన వుండే అమ్మఒడిలో కూర్చొని గ్లాసుతో పాలు తాగడం మరచిపోగలమా?నాన్న కొడుతుంటే చటుకున్న లాక్కొని తన పైట కొంగులో దాచుకోని పసిబిడ్డను పట్టుకోని కొడతార బుద్దిలేదు అని ఏడ్వడం మరచిపోగలమా?నువ్వు అలిగి బువ్వ తినకుంటే మ నాన్న కదూ ఒక్క ముద్ద తినరా?లెకుంటే ఈ అమ్మ పై ఓట్టే అని బుజ్జగించి గొరుముద్దలు తినిపించడం మరచిపోగలమా?

 

 

అమ్మ నిన్ను కర్రతీస్కోని కొడుతుంటే అమ్మ కొట్టకే నీ ముద్దుల బిడ్డను చచ్చిపొతానే కొడితే అంటే పక్కున నవ్వి టక్కున లాక్కొని అల్లరి వెదవ అని ముద్దు పెట్టడం మరచిపోగలమా?డాక్టరు సూది వేస్తుంటే ఏడుస్తున్న నిన్ను హత్తుకోవడం మరచిపోగలమా?కాళ్ళనెప్పితో నడవలేకుంటే చంకన ఎత్తుకోవడం మరచిపోగలమా?రోగమొస్తే పక్క విడవక సేవలు చెయడం మరచిపొగలమా?అమ్మ పిలిచే పిలుపు నాన్న,కన్న,చిన్న,చిట్టి,బుజ్జి,పండు మరచిపొగలమా?అమ్మ ఉదయాన్నె ముద్దిచి నిద్రలేపడం మరచిపోగలమా?వానలో తడిసి వస్తే అన్నయ్య అంటాడు గొడుగు తీసుకెల్లచు కదా అని,చెల్లి సలహా ఇస్తుంది వాన తగ్గే దాక ఆగచ్చు కదా అని,నాన్న తిడతాడు వానలో తడవకూడదని ఎపుడు తెలుసుకొంటావొ ఏమో అని,కాని ఒక్క అమ్మ మాత్రం ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చెదాక ఆగకూడద అంటూ తలతుడుస్తుంది.

 

అది అమ్మ అంటే.నువ్వు ఆకతాయితనంతో పొరుగువారితో అల్లరిచేస్తూ గోడవలు తీసుకొస్తే వాల్లనే తిడుతూ నిన్ను సమర్దించడం మరచిపోగలమా? ఇవన్నీ మన చిన్నపుడు మన కోసం మన అమ్మలు చేసినవే...మిత్రూలార!దయచేసి అమ్మను తిట్టడం,ఈ గజిబిజి చకచక పరుగులలో అమ్మను నిర్లక్ష్యం చేయడం,పట్టించుకొనే దిక్కులేక ఓల్దేజ్ హోముల్లో పడేయడం,బార్య,భర్తల మోజులో అమ్మను అశ్రద్ద చేయడం వంటివి చేయకండి.దయచేసి అమ్మను మోసం చెయకండి.అమ్మ మనస్సు నొప్పించకండి.అమ్మ కన్నీరుకి మీరు కారణం కాకండి.ఎందుకంటే మీరెన్ని చెసిన కన్నీటి తడితో కూడా బాగుండాలి అని కోరుకొనేది ఒక్క అమ్మే,ఈ ప్రపంచంలో ఇంకా కలుషితం కాకుండ ఏదైన వుంది అంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే.ఒక్కసారి అందరం మన అమ్మని  గుర్తుచేసుకుని ధన్యవాదములు తెలుపుదాం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: