భారత దేశంలో కరోనా మహమ్మారి కొన్ని రోజులుగా పేట్రేగిపోతోంది. గత ఐదు రోజుల్లోనే కేసులు రెట్టింపు అవ్వడం ఇపుడు కేంద్రానికి ఒకింత కష్టంగా మారుతోంది. నిన్న అనగా.. శుక్రవారం ఒక్కరోజే 508 కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవ్వడం, కలవర పెడుతోంది. ఇప్పటివరకు, దేశం మొత్తంగా చూసుకుంటే గనక, 86 మంది చనిపోయినట్లు అంచనా. 

 

ఇక అత్యధికంగా కేసులు నమోదు కాబడిన రాష్ట్రము.. మహారాష్ట్ర. 490 కేసులు ఇక్కడ నమోదయ్యాయి. దాని తరువాత సెకండ్ స్థానంలో తమిళనాడు వుంది, ఇక్కడ 411 మందికి కరోనా కాటేసింది. ఆ తదుపరి దేశ రాజధాని అయిన ఢిల్లీలో 386 కేసులు నమోదు కాగా.... కేరళ 295, తెలంగాణ 229, రాజస్థాన్ 179, ఉత్తరప్రదేశ్ 174, ఆంధ్రప్రదేశ్ 164, మధ్యప్రదేవ్ 154,కర్ణాటక 128 కేసులు నమోదయ్యాయి.

 

ఇకపోతే... అత్యధిక కేసులు నమోదు చేసుకున్న దేశం అమెరికా అని అందరికి తెలిసినదే. ఇక్కడ యెంత ఎక్కువగా బాధితులు వున్నారంటే.. అక్కడ ప్రస్తుతం ఫేస్ మాస్కుల కొరత ఏర్పడిందని కొద్ది సేపటి క్రితమే ప్రముఖ న్యూస్ ఛానల్ BBC పేర్కొంది. ఆరోగ్య నిపుణులు CDC మెడికల్ గ్రేడ్ ఫేస్ మాస్క్ లను రికమండ్ చేసినా, అవి అందుబాటులో లేక హెల్త్ కేర్ సిబ్బంది హోంమేడ్ మాస్క్ లనే వాడుతున్నట్లు వినికిడి.

 

ప్రపంచలో మొత్తం కేసులు: 11, 33, 801
మరణాలు: 60, 398
రికవరీ కేసులు: 2, 36, 005

 

ఇండియాలో మొత్తం కేసులు: 3082 
మరణాలు: 86 
కొత్త కేసులు: 23
రికవరీ కేసులు: 229 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 229
యాక్టివ్ కేసులు: 186 
కొత్త కేసులు: 75
మృతులు: 11 
కోలుకున్నవారు: 32 

 

ఏపీలో మొత్తం కేసులు: 180 
కొత్త కేసులు: 16
మృతులు: 2 

 

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 27
గుంటూరు: 23
కడప: 23
ప్రకాశం: 18 
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 15
తూర్పు గోదావరి: 11  
చిత్తూరు: 10 
కర్నూలు: 4 
అనంతపురం: 2

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: