కరోనా దెబ్బకు దేశ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ ప్రధాని మోదీ 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఇక ఈ కరోనా దెబ్బకు ఎమర్జన్సీ సేవలు మినహా, మిగతా సేవలన్నీ నిలిచిపోయాయి. కాకపోతే ప్రజలకు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు కొంత సమయం ఇచ్చారు. అలా కాకుండా పని లేకుండా రోడ్ల మీద తిరిగితే మాత్రం పోలీసులు కఠినంగానే రియాక్ట్ అవుతున్నారు.
అయితే ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనున్న విషయం తెలిసిందే. అంటే ఏప్రిల్ 15 నుంచి పరిస్థితులు యథావిధిగా వచ్చేయనున్నాయి. కానీ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ మర్కజ్ వల్ల కరోనా బాధితులు పెరిగిపోయారు. చాలా రాష్ట్రాల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వారికి కరోనా పాజిటివ్ ఉంటుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కాకపోతే ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితులు దిగజారిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తివేయాల్సిన పరిస్థితి ఉంది. అలా అని పూర్తిగా లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ తీసేస్తుందా? లేదా అనేదానిపై క్లారిటీ లేదు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తేసినా, కొన్ని ఆంక్షలు విధించే అవకాశముంది. షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటి చోట్ల ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి, వాటికి పర్మిషన్ ఇచ్చే అవకాశముండదు.
అలాగే నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు ఇప్పటిలాగానే, ఆంక్షలు కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే పిల్లలు, వృద్ధులకు బయట తిరిగే అవకాశం ఇవ్వకపోవచ్చు. వారిపైనే కరోనా ప్రభావం ఎక్కువ చూపే అవకాశం ఉండటంతో, 10 ఏళ్ళు లోపు, 60 ఏళ్ళు పైబడి ఉన్నవారికి బయటకొచ్చే పర్మిషన్ ఉండకపోవచ్చు. మరి చూడాలి అసలు లాక్ డౌన్ ఎత్తేస్తారో? లేక కొనసాగిస్తారో?
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle