ఏపీలో ప్రస్తుతం అంతా కరోనా గురించిన హడావిడే నడుస్తోంది. ఎక్కడ చూసినా అటు ప్రభుత్వాలు ఇటు ప్రతిపక్షాలు కరోనా గురించిన విమర్శులు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వణికించేస్తోంది. ఇప్పటికే అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాను కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అయితే సడెన్‌గా ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే రూటు మార్చి సైకిల్ యాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పార్టీ ఓడిపోయినప్పటి నుంచి అటు అసెంబ్లీలోనూ.. ఇటు బయటా అధికార వైసీపీని గట్టిగా టార్గెట్గా చేసుకుంటూ వస్తున్నారు.
తాజాగా నిమ్మల రైతుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో తన సొంత నియోజకవర్గం అయిన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచి జిల్లా కేంద్రమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పలువురు టీడీపీ కార్యకర్తు కూడా పాల్గోన్నారు. ఓ వైపు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ అమలు అవుతోంది.. ప్రజలు ఎవ్వరు బయటకు రావొద్దని చెపుతున్నారు. ఈ టైంలో నిమ్మల ఏకంగా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తన పార్టీ కార్యకర్తలతో ఏకంగా 90 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టడంతో భీమవరం వద్ద మార్గమధ్యలోనే ఎమ్మెల్యే నిమ్మలను పోలీసులు అరెస్టు చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple