దేశంలో కరోనా బాధితుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ 4067 మంది కరోనా భారీన పడ్డారు. గత 24 గంటల్లో 693 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 1495 మంది ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారే కావడం గమనార్హం. కేంద్ర నిఘా వర్గాలు కరోనాను అస్త్రంగా చేసుకుని భారత సైన్యాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా పాక్ కుట్ర పన్నిందని చెబుతున్నాయి. 
 
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అనేక మంది ఉగ్రవాదులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరు పాక్ సైనికులతో టచ్ లో ఉండటం వల్ల కరోనా సోకిందని సమాచారం. కేంద్ర నిఘా వర్గాలు పాక్ కరోనా సోకిన 800 మందిని నియంత్రణ రేఖ దాటించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నాయి. వీరి సహాయసహకారాలతో పాక్ ఇండియన్ ఆర్మీని దెబ్బ తీయాలని భావిస్తోంది. ఈ కుట్ర ఐఎస్ఐ అధికారుల నేతృత్వంలో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
విషయం తెలిసిన వెంటనే భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే భారత్ భూభాగంలోకి వచ్చిన 9 మంది పాక్ ఉగ్రవాదులను భారత సైనికులు గత 48 గంటల్లో మట్టుబెట్టారు. భారత సైన్యం కరోనాతో దెబ్బ తీయాలనుకుంటున్న పాకిస్థాన్ కుట్రను తాము సమర్థవంతంగా ఎదుర్కోగలమని చెబుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో లాక్ డౌన్ విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సి ఉంది. మోదీ లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: