దేశంలో ఓ వైపు కరోనా వైరస్ ప్రబలి పోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తిని తెలంగాణలో అరికట్టేందుకు ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిన్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుక తెలంగాణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
కానీ ఈ మద్య కొంత మంది సలహాలు, సూచనలు ఇస్తే వారికి కరోనా వైరస్ రావాలని, పోవాలని అంటున్నారని వారిందరికీ కరోనా వైరస్ రావాలని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఓ ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని అన్నారు. శత్రువులకైనా కరోనా రావద్దని కోరుకుంటామన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే వారికి కరోనా రావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని.. ప్రజలకు ఆయన ఏం సంకేతమిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంత పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదని అన్నారు. కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు డీజీపీ, సీఎస్ ఇద్దరూ ఉన్నారని, మరి ఎందుకు ఆయనపై కేసు పెట్టలేదని నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple