కరోనా మహమ్మారి జీవితాలను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి. మీడియా రంగంలో ఈ దిశగా కోత అప్పుడే మొదలైందని అప్పుడే వాట్సప్ సందేశాలు హోరెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్టీవీ ఛానల్ ఉద్యోగులు మాత్రం మా యజమాని దేవుడంటూ వాట్సప్ మెస్సేజులు పెడుతున్నారు.

 

 

అసలు విషయం ఏంటయ్యా అంటే... సంస్థకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా సరే... జీతాల్లో కోత విధించే ప్రసక్తే లేదని.. నష్టాలను భరించి సంస్ధలో పని చేసే ఉద్యోగులు.. వారి కుటుంబాలకు ఈ కష్టకాలంలో అండగా నిలవాలని ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి నిర్ణయించారట. ఉద్యోగుల జీతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కోత విధించేది లేదని ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి స్వయంగా ఉద్యోగుల సమక్షంలో ప్రకటించారట.

 

 

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎన్టీవీ ఛైర్మన్ చౌదరి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సంస్ధలోని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సంస్ధలో పని చేసే ఉద్యోగులే కాదు.. అసలే కష్టకాలంలో ఉన్న మిగిలిన పాత్రికేయ మిత్రులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి జర్నలిస్ట్ సమాజం మెచ్చుకుంటోంది. అయితే ఇప్పుడే కాదు.. గతంలో చంద్రబాబు హయాంలోనూ ఎన్టీవీ కొన్నాళ్లు బహిష్కరణకు గురైంది. ఆదాయం కోల్పోయింది. అప్పుడు కూడా చౌదరి వేతనాల జోలికి రాలేదని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు.

 

 

అయితే మహా మహా పెద్ద సంస్థలు కూడా తమ ఉద్యోగులను త్యాగాలు చేయమని కోరుతున్నాయి. ఓయో వంటి సంస్థ.. కూడా ఇలాంటి ప్రకటనే చేసింది.. అయితే ఆ సంస్థలోని 60శాతం ఉద్యోగులను మూడు నెలల పాటు సెలవులపై వెళ్లాలని ఆదేశించింది. ఇంకా పలు సంస్థలు ఇలాంటి నిర్ణయాలకు సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: