మే మూడో తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు పొడిగిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవడం పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ నిబంధనలు ఈరోజుతో ముగుస్తుండడంతో, అతి కొద్ది రోజులు పొడిగించడమో, లేక కొన్ని నిబంధనలతో మరికొంత కాలం పొడిగించినా, కాస్త వెసులుబాటు కల్పిస్తారని జనాలు అంచనా వేశారు. ఈ నిర్ణయం వెలువడక ముందే చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధనలు పొడిగిస్తూ ప్రకటన చేశాయి. పంజాబ్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్లు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. వ్యవసాయ పనులు, ఉపాధి నిమిత్తం కొంత వెసులుబాటు కల్పించాయి. ఇక ప్రధాని మోదీ కూడా ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తారని అందరూ అంచనా వేశారు. అయితే అనూహ్యంగా ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు నిబంధనను పొడిగిస్తున్నట్టుగా ప్రకటించారు. 

IHG

 మూడో తేదీ వరకు ఆ నిబంధనలు పొడిగించడం వెనుక కారణాలు చాలా మందికి అర్థం కాలేదు. అయితే దీని వెనుక మోదీ చాలా విషయాలనే పరిగణలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒకటో తేదీ పబ్లిక్ హాలిడే కాబట్టి కార్యాలయాలు ఉండవు. ఆ తర్వాత రోజు శనివారం, మూడో తేదీ ఆదివారం. దీంతో 30 వ తేదీన లాక్ డౌన్ ను ఎత్తివేస్తే వరుసగా మూడు రోజులు సెలవులు కాబట్టి జనాలు విచ్చలవిడిగా బయటకు వస్తారని, యధావిధిగా తమ కార్యకలాపాలు చేసుకోవడం, గుళ్లకు, పర్యాటక ప్రదేశాలకు వెళ్తారని అంచనా వేసి  మే మూడో తేదీ వరకు ఈ లాక్ డౌన్ నిబంధన విధించినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఏప్రిల్ 20వ తేదీతో లాక్ డౌన్ నిబంధనల సడలింపు ఇస్తామని మోడీ ప్రకటించిన నేపథ్యంలో, ఆ సడలింపులు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజల్లో అనేక సందేహాలకు కారణమవుతోంది. 


 మోదీ చెప్పిన సడలింపులు కేవలం రెడ్ జోన్ పరిధిలో ఉండే వారికి మాత్రమేనని తెలుస్తుంది. ప్రస్తుతం రెడ్ జోన్ పరిధిలో ఉండే వారు ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఏప్రిల్ 20వ తేదీన కేవలం వారికి సంబందించిన సడలింపులు మాత్రమే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక రకంగా మన దేశం నుంచి కరోనా ను తరిమికొట్టాలనే కృతనిశ్చయంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: