ఇది కరోనా కాలం.. కనీసం చనిపోయినా ఆత్మీయులు వెంట వస్తారన్న గ్యారంటీ లేని కాలం.. అవును మరి.. మొన్న నెల్లూరులో ఓ ప్రముఖ డాక్టర్ మరణం ఎంత దారుణంగా జరిగిందో చూడలేదా. ఆప్తులు ఉండీ.. ఆస్తుు ఉండీ కూడా ఆయన శవాన్ని నాలుగైదు శ్మశాన వాటికలు మార్చి.. ఎవరూ వద్దు వద్దు అంటూ ఆందోళన చేస్తుంటే.. ఎప్పుడో అర్థరాత్రి.. అదీ ఆత్మీయులు లేకుండా అంత్యక్రియలు చేసేశారు.

 

 

ఇది చూసి.. ఇదేం పాడు రోగం.. ఇదేం పాడుకాలం.. పగవాడికి కూడా ఇలాంటి చావు.. అంతిమ ఘడియలు రాకూడదని కోరుకుంటున్నారు చాలా మంది. కానీ నెల్లూరు డాక్టర్‌ గారికే కాదు.. ఆనాటి శ్రీకృష్ణుడిదీ అదే పరిస్థితి అని చెబితే ఆశ్చర్యపోతారేమో కానీ పురాణాలు చెబుతున్నదాన్ని బట్టి అదీ నిజమే. జగం అంతా నేనే, మిగతా జగత్తు నిమిత్త మాత్రం.. ఏది ఎలా జరగాలో ముందే లిఖించబడి ఉన్నది అని అర్జునుడికి గీతాబోధ చేసిన ఆ దేవదేవుడు కూడా విధిరాతకు అతీతుడు కాడనిపించుకునేలా అనాథగానే వెళ్లిపోయాడట.

 

 

ఇంతకీ అది ఎలా జరిగిందంటారా.. యాదవ పరివారంలో ముసలం పుట్టి, తప్పతాగి యాదవ పరివారం పరస్పరం కొట్టుకుని మరణిస్తారు. కృష్ణుడు ద్వారకకు దూరంగా ఎక్కడో తపోవనంలో ఉంటాడు. కృష్ణుడిని హతమార్చటానికే జన్మించిన ఓ బోయవాడు లేడి అనుకుని, కృష్ణుడి పాదానికి తగిలేలా బాణం వేస్తాడు. అంతటి కురుక్షేత్ర సమరంలో, కోట్ల బాణాలు కూడా ఏమీ చేయలేని కృష్ణుడిని ఈ చిన్న గాయం పీడిస్తుంది. ప్రాణాలు తీస్తుంది. ప్పటికే ప్రాణాలు పోయి నాలుగైదు రోజులు. ద్వారకకు తీసుకుపోయే వీలులేదు.

 

 

ఎందుకంటే అసలు ద్వారకే సముద్రంలో మునిగిపోతున్నది. కృష్ణుడిని వెదుక్కుంటూ వచ్చిన అర్జునుడు తపోవనంలో శ్రీకృష్ణుని మృతదేహం చూస్తాడు. అర్జునుడు ఒక్కడే తనకు తోచిన రీతిలో అంత్యక్రియలు పూర్తిచేస్తాడు. పదహారు వేల మంది భార్యలు, ఎనిమిది మంది పట్టమహిషులు. ఎనభై మంది సంతానం. పెద్ద రాజ్యం. అఖండమైన కీర్తి, అపారమైన సంపద, అపూర్వమైన బలగం. ఉన్నా చివరకు తుది వీడ్కోలు వేళ మిగిలింది ఒకే ఒక్కడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: