ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిన్నటివరకు 647 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 158 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 17 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్ రాష్ట్రంలోని 93 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన సీఎం జగన్ రాష్ట్రంలో జీరో వడ్డీ పథకాన్ని పునః ప్రారంభించనున్నారు. ఈ పథకం వల్ల పొదుపు సంఘాలకు 1400 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ఏపీలో రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కార్యకలాపాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఈరోజు నుంచి లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని మండలాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. రాష్ట్రంలో 97 మండలాలను ప్రభుత్వం రెడ్ జోన్లుగా ప్రకటించింది. గ్రీన్ జోన్ లో కార్యకలాపాలు ప్రారంభించే పాటించే సంస్థలు కూడా కఠినమైన నిబంధనలు పాటించాలి. 
 
రెడ్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు లేకుండా మే 3 వరకు యథావిధిగా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతాయి. జిల్లా స్థాయి కమిటీ ఏయే మండలాల్లో ఏ పరిశ్రమలను తెరవచ్చో నిర్ణయిస్తుంది. తహశీల్దార్, ఎంపీడీవో, ఇతర అధికారులు పరిశ్రమలలో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా వైరస్ విస్తరించి రెడ్ జోన్ గా మారితే అప్పటివరకు ప్రభుత్వం వారికి ఇచ్చిన అనుమతులు అన్నీ రద్దవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: