టీడీపీ జాతీయ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 70వ వసంతంలోకి నేడు అడుగు పెట్టారు. భారతదేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. బాబు రాజకీయ ప్రస్థానం చూస్తే... 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయన. అంతేనా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో ఆయన కీలక పర్వం వహించారు. ఇకపోతే ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు తన మార్క్ కీలక పాత్ర పోషించారు. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను. Wishing you a happy 70th Birthday Sir @ncbn Your vision, your hard work, your dedication are exemplary pic.twitter.com/aM9uRzEZZH
— chiranjeevi konidela (@KChiruTweets) April 20, 2020
ఇక నేడు టీడీపీ అధినేత పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నేతలు, తెలుగు తమ్ముళ్లు శుభాకాంక్షలతో, అభినందనలతో ముంచెత్తుతున్నారు. కరోనా, లాక్ డౌన్ వేళ ఆయన్ను నేరుగా కలిసే అవకాశం ఉండకపోవడంతో... అందరూ ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతున్నారు. కరోనా వైరస్ సందర్బంగా టీడీపీ పార్టీ కూడా చంద్రబాబు బర్త్ డే వేడుకలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇలాంటి కష్టకాలంలో వేడుకలు నిర్వహించడం సరికాదని పార్టీ భావించింది. అందుకే చాలామంది అభిమానులు స్పెషల్ వీడియోలతో, ఫొటోలతో బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు నేతలు, సినీ వర్గ ప్రముఖులు.
Leader - From listening Truth to Transformation of lives for Good.#HBDPeoplesLeaderCBN pic.twitter.com/mrWDqCd6p1
— Win in silence (@BoppanaPratibha) April 19, 2020
ఇకపోతే టాలీవుడ్ మెగాస్టార్ చిరు, బాబు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయన వారిద్దరూ ఏదో కార్యక్రమంలో కలుసుకున్న సందర్బంగా హాయిగా నవ్వుకున్న ఫోని పెట్టి " అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను." అంటూ 70 వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందరబంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరు.