ఇప్పటికే ఎన్నో కఠిన నియమ నిబంధనలు విధించిన... ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినా... వేలకోట్లు  ఖర్చుపెట్టినా ... ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ... పరిస్థితి మాత్రం ఎక్కడా అదుపులోకి వస్తున్నట్టుగా కనిపించడంలేదు. అసలు ఈ కరోనా ను కట్టడి చేయగలరా అనే సందేహాలు కూడా జనాల్లో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నెలరోజులుగా జనాలంతా ఇళ్లల్లో లాక్ అయిపోయారు. మార్చి 24 తేదీ నుంచి మర్చి 31 వరకు లాక్ డౌన్ నిబంధన అమలు చేసారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మళ్ళీ ఏప్రిల్ 14  వరకు నిబంధన పొడిగించారు.అయినా అదే పరిస్థితి. దీంతో మళ్ళీ మే 03 వరకు ఈ నిబంధన పొడిగించారు. అయినా అదే పరిస్థితి. ఇప్పటికే కేసుల సంఖ్య 20 వేలు దాటింది. ఇప్పటీకే పరిస్థితి అదుపులోకి వచ్చేలా కనిపించకపోవడంతో మరికొంతకాలం ఈ లాక్ డౌన్ ను పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. 

   

IHG

కరొనకు మందు ఏది లేకపోవడంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని కేంద్ర నమ్ముతోంది.కానీ కొత్త కొత్త కేసులు నమోదవ్వడం వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో కేంద్రం రాష్ట్రాలు, విఫలమవుతూనే ఉన్నాయి. తాజాగా మే 3 తేదీ నుంచి దేశీయ విమాన ప్రయాణాలకు యధావిధిగా తిరిగేందుకు అనుమతించారు. జూన్ 1 నుంచి విదేశీ ప్రయాణాలకు అనుమతులు వచ్చాయి. దీంతో టికెట్ల అమ్మకాలను ఎయిర్ లైన్స్ సంస్థలు మొదలుపెట్టాయి. అయితే అకస్మాత్తుగా భారత ప్రభుత్వం టికెట్ల అమ్మకాలు ఆపేయండంటూ దేశ విదేశీ విమానయాన సంస్థలను ఆదేశించింది. దీనికి కారణం ప్రధాని మోడీ ఈ నెల 27న మరోసారి రాష్ట్రాల సీఎంలతో భేటి కాబోతున్నారు.

 

 లాక్ డౌన్ గడువు పెంచితే పరిస్థితి ఎలా ఉంటుంది ..? అనే విషయంపై లోతుగా చర్చించేందుకు ఈ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే  రెండు సార్లు మీటింగ్ తర్వాత మోడీ లాక్ డౌన్ పొడిగించారు. ఇప్పుడు కూడా జూన్ ఒకటో తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించాలనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా కట్టడికి ఇంతకు మించి ప్రస్తుత పరిస్థితుల్లో మరో మార్గం కనిపించకపోవడంతో ఈ విధమైన ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ విషయమై పూర్తిగా చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని మోదీ భావిస్తున్నారు. అయితే మరికొంతకాలం ఈ నిబంధనలను కనుక పొడిగిస్తే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం లేకపోలేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: