కరోనా వైరస్ అనే కనిపించని శత్రువును తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశం మొత్తం అన్ని రంగాలు ఎక్కడికక్కడ మూతపడ్డాయి. ఎగుమతులు దిగుమతులు నిలిచి పోవడంతో పాటు... కంపెనీలు విద్యాసంస్థలు ఇలా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోకి కొన్ని దిగుమతులు జరగని నేపథ్యంలో దేశంలో రానున్న రోజుల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 15 వరకు మాత్రమే లాగ్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కూడా లాగ్ పొడిగించే అవకాశాలు ఉన్నాయి అంటూ టాక్ వినిపిస్తోంది. అయితే ఒకవేళ మే నెలాఖరు నాటికి ఇలాగే కొనసాగితే దేశంలోని నాలుగు కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కాబోతున్నాయి అంటూ... ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వెల్లడించింది.
ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్ల వాటి విడిభాగాలు విక్రయాలపై దిగుమతులపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలాగే కొనసాగితే... రాబోయే రోజుల్లో నాలుగు కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్ లు ఉండవు అని అంచనా వేసింది ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్. లాక్ డోన్ సమయంలో కొత్త మొబైల్ ఫోన్లు వాటి విడిభాగాలు అందుబాటులో లేకపోవడం కారణంగా 2.5 కోట్ల మంది ఫోన్ లు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని అలాగే హ్యాండ్ సెట్ ల లో తలెత్తే లోపాలు- మొబైల్ బ్రేక్ డౌన్ వల్ల మరికొన్ని మొబైల్స్ నిరుపయోగంగా మారనున్నాయని అంచనా వేసింది .
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 85 కోట్ల మొబైల్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయి అని తెలిపిన ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్... ప్రతి నెల దాదాపుగా 2.5 కొత్త మొబైల్ అమ్ముడవుతున్నాయి అంటూ పేర్కొంది. ఇందులో ఆపిల్, ఫాక్స్కాన్, షియోమీ వంటి సంస్థలు సభ్యులుగా ఉన్నాయట . అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం అత్యవసర వస్తువుల కు మాత్రమే అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. కానీ అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లు లేకపోవడం గమనార్హం.ఈ నేపథ్యంలోనే అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్ ఫోన్లను చేర్చాలి అని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ తెలిపారు.