దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
మరి మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా...? లేదా...? అనే ప్రశ్నకు లాక్ డౌన్ ను కచ్చితంగా పొడిగిస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రజా రవాణా విషయంలో కూడా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు మోదీ షాక్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
మోదీ ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు దేశప్రజలంతా మే 3వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల సామాన్యులు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
లాక్ డౌన్ వల్ల చాలామంది ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. వీళ్లు సొంతూళ్లకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోదీ మే 3వ తేదీ చేసే ప్రకటనపై దేశవ్యాప్తంగా ప్రజలందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. మోదీ లాక్ డౌన్ పొడిగించినా ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.