నన్ను వదిలెయ్యి.. నికు దండం పెడతాను.. నాకు భయమేస్తుంది.. నన్ను కొరికి చంపకు.. నాకు నొప్పిస్తుంది..నాకు బ్రతకాలని ఉంది.. నన్ను ఎం చేయకు.. అంటూ ఆడవాళ్ల ఆవేదనను కూడా ఈ పాడు సమాజం పట్టించుకోలేదు.. మగాడు మృగడై క్షణ కాలం సుఖం కోసం నరకాసురుడు లాగా మారుతున్నాడు..
పూర్వం మనుషులను తినే రాక్షసులు ఉన్నారు అంటూ చరిత్ర పుస్తకాల్లో చదివే వాళ్ళు కానీ ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళు ఉన్నారట అని చదివే రోజులు వచ్చాయి.. ఎక్కడ చూసినా కూడా నెత్తుటి మరకలు.. ఆడవాళ్ల అర్దనాదాలు..మగాడికి కనపడవు..చెప్పే వాళ్ళు ఎవరు..చంపేవాల్లు ఎవరు.. మగాడి ఆగడాలకు ఆడపిల్ల బలవ్వల్సిందేనా.. దిశ కేసును పూర్తిగా మరువక ముందే మరొక కేసు నమోదు అయింది..
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం. పెద్దగా ప్రజలు తిరిగే ప్రదేశం కాదది. అలాంటి చోట... బేరాలు రాక ఓ ఆటోడ్రైవర్ ఖాళీగా కూర్చున్నాడు. మొబైల్ ఆన్ చేసి... 4జీ డేటాతో... యూట్యూబ్‌లో వీడియోలు చూడసాగాడు. ఇంతలో... ఓ బాలిక అటుగా నడుస్తూ వెళ్తూ కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు. ఆటోడ్రైవర్ ఆ బాలిక వైపే చూస్తూ ఉన్నాడు. అతని వైపు చూడని ఆ బాలిక... తన దారిన తాను వెళ్లసాగింది. వెంటనే ఆటో ఆన్ చేశాడు.... బాలిక పక్క నుంచీ ఆటోని పోనిస్తూ... ఎక్కడి కెళ్లాలి... ఆటో ఎక్కుతావా అని అడిగాడు. ఆ బాలిక ఎక్కను అన్నట్లుగా తల ఊపి... తన దారిన తాను నడవసాగింది. ఆటోను కొంత దూరం వేగంగా నడిపాడు. ఆటో సైడ్ మిర్రర్ లోంచీ చూశాడు. వెనక బాలిక నడస్తూ రావడం గమనించాడు. చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు.
ఆటో దిగి వెనక సీట్లో కూర్చున్నాడు. ఆటో పక్క నుంచీ బాలిక వెళ్తుండగా... బాలిక చెయ్యి పట్టుకొని బలవంతంగా ఆటోలోకి లాగాడు. వదులు... వదులు అంటూ బాలిక ఎంతలా గించుకున్నా వదల్లేదు. ఆటోలో బలవంతంగా రేప్ చేశాడు. దాంతో ఆ పాప అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాలికను ఆటోలోంచీ బయటకు లాగి... పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లోకి లాక్కెళ్లి పడేశాడు. తర్వాత ఆటోను వేగంగా నడుపుతూ వెళ్లిపోయాడు.
ఎవరో అటుగా వెళ్తున్న వ్యక్తి చూసి కాసేపటి తర్వాత అటుగా ఎవరో వెళ్తూ... ముళ్ల పొదల్లో బాలికను చూశారు. అయ్యో అనుకున్నారు. వెంటనే లేపి... నీళ్లు పట్టించారు. ఆ తర్వాత పోలీసులకు కాల్ చెయ్యడం వాళ్లు రావడం... బాలికను వివరాలు అడగడం, పాపను ఆస్పత్రికి పంపడం అన్నీ జరిగాయి. ఎవరో ఇచ్చిన సమాచారంతో... ఆటోడ్రైవర్‌ను గుర్తించి అరెస్టు చేశారు. ఇదీ జరిగిన దారుణం. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్‌కౌంటర్‌లో లేపేసినా సమాజంలో మార్పు రావట్లేదు. ఫిబ్రవరి 1 నిర్భయ దోషులకు ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ..మరి ఈ దారుణాలు మాత్రం ఎక్కడా ఆగడం లేదని చెప్పాలి...