ప్రస్తుతం దేశంలో కరోనా ఒకవైపు బాధిస్తుంటే, మరోవైపు వన్యప్రాణులను వేటాడి చంపుతున్నారు వేటగాళ్లు. విద్యుత్ తీగలు పెట్టి చుక్కల దుప్పిని చంపి వాటి మాంసాన్ని విక్రయించిన 7 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ ప్రాంతంలోని నర్సంపేట FRO రమేష్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఆయన అందించిన సమాచారం మేరకు వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని చిలుకమ్మ నగర్ ప్రాంతానికి చెందిన ఇస్లావత్, కిషన్, మూడు మోహన్ వీరు ముగ్గురు కలిసి అడవి జంతువులను చంపడానికి విద్యుత్ తీగలను పెట్టి వాటిని హతమార్చారని తెలియజేశాడు.
అయితే ఆదివారం ఉదయం తెల్లవారుజామున వీరు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి ఒక చుక్కల దుప్పి మృత్యువాత పడింది. అయితే ఆ దుప్పి మాంసం ని వరంగల్ జిల్లాలోని కొత్తూరుకు చెందిన జాటోత్ సార్లు, జాటోత్ బాలు మరో గ్రామం చెన్నారావుపేట మండలం కొనపురం గ్రామానికి చెందిన కిరణ్ విద్యాసాగర్ లకు విక్రయించారు. అయితే ఆ విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై కు సమాచారాన్ని తెలిపారు.
దీనితో కొత్తూరు లోని అజ్మీరా ఏరియా ఇస్లావత్ కిషన్ వారితో పాటు బాలు, సార్లు, విద్యాసాగర్, కిరణ్ లను అదుపులోకి తీసుకొని అడవి శాఖ అధికారులకు వారిని అప్పగించారు. అయితే అటవీశాఖ అధికారులు వారి మీద కేసు నమోదు చేశారు. అయితే మూడు మోహన్ పరారీలో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు.
ఎవరైతే వన్యమృగాలను వేటాడి చంపుతారు వారికి కఠిన చర్యలు తప్పవని వన్య రక్ష పోలీసులు తెలిపారు.