ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నైతిక స్థైర్యాన్ని కలిగించే పని చేశారు.తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకుని వెంటనే అమలు చేశారు. డీజీపీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య ప్రజలు సైతం ప్రశంసిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పంజాబ్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పోలీస్ పై దాడి చేశారు. ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించిన పోలీస్ పై దాడి చేయడంతో పాటు చేయి నరికేసి వెళ్లారు. 
 
చేయి నరికినా పోలీస్ వాళ్లను వదలకుండా కష్టపడి పట్టుకోవడం, వాళ్లపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తరువాత సదరు పోలీస్ పోలీస్ అధికారి ఆస్పత్రిలో చేరగా మూడు రోజుల్లో విరిగిన చేయి అతుక్కుంది. గుర్తు తెలియని వ్యక్తులు పబ్లిక్ లో పోలీసులను మోరల్ గా దెబ్బ తీయటానికి చేసిన ప్రయత్నంగానే ఈ ఘటనను భావించాల్సి ఉంటుంది. ఈ ఘటన అనంతరం గౌతమ్ సవాంగ్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. 
 
గాయపడిన పోలీస్ ఆఫీసర్ అర్జిత్ సింగ్ కు మద్దతుగా నిన్న పోలీస్ శాఖ తరపున "వీ ఆర్ అర్జిత్ సింగ్" అనే పేరుతో బ్యాడ్జీ పెట్టుకుని అన్ని జిల్లాల యూనిట్ల అధికారులు నిన్న విధులు నిర్వహించారు. అందరు అర్జిత్ సింగ్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్లను ధరించి సంఘీభావ సంకేతాన్ని పంపించారు. పోలీసుల్లో మానసిక స్థైర్యం నింపటానికి గౌతమ్ సవాంగ్ తీసుకున్న నిర్ణయానికి సామాన్య ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 
 
ఎక్కడో పంజాబ్ లో జరిగితే మనకెందుకులే అని అనుకోకుండా గౌతమ్ సవాంగ్ మనకేదైనా జరిగితే మన శాఖ అంతా మన వెనకే ఉంటుందనే సందేశాన్ని ఇచ్చారు. మరోవైపు గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారానే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయని డీజీపీ అభిప్రాయపడ్డారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: