ఏపీ ఆర్థిక మంత్రి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ , ఏపీ మంత్రి బుగ్గన, టీడీపీ నేత బోడా ఉమా మహేశ్వరరావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల గవర్నర్ కు కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖలో తన పేరును ప్రస్తావించడంపై బుగ్గన స్పందిస్తూ తాను డైరెక్టర్ గా ఉన్న కంపెనీల ద్వారా ఏపీ ప్రభుత్వం కిట్లను కొనుగోలు చేసిందనే ఆరోపణలను ఖండించారు.
ఈరోజు ఉదయం 9 గంటల లోపు ఆధారాలతో సహా నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని బుగ్గన అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా...? అని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాజకీయాలు చేయడం సరికాదని బుగ్గన అన్నారు. కరోనా పరీక్షలు నిర్వహించడంలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు.
కొందరు ఉద్దేశపూర్వకంగానే అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బుగ్గన చేసిన సవాల్ పై కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. గత నెల 27న రాసిన లేఖను బుగ్గన పూర్తిగా చదివారా అని ప్రశ్నించారు. తాను బుగ్గన సోదరుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీకి ఏపీ ప్రభుత్వం కిట్ల కొనుగోలును అప్పగించిందని పేర్కొన్నానని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. మరోవైపు టీడీపీ నేత బోండా ఉమ జగన్ సర్కార్ పై ఘాటు విమర్శలు చేశారు.
కమిషన్లకు కక్కుర్తి పడి ఏపీ ప్రభుత్వం కిట్లను కొనుగోలు చేసిందని అన్నారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ఎక్కువ రేట్లకు కరోనా కిట్లను కొనుగోలు చేశారని మండిపడ్డారు. కరోనా టెస్టులు, కేసుల ధృవీకరణలో ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని ఆరోపణలు చేశారు. కరోనా వ్యాప్తిలో ఏపీలో దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలపాలని అన్నారు.
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గారు,
— Kanna lakshmi Narayana (@klnbjp) May 1, 2020
రాజీనామా సవాలు చేసే ముందు ఈ లేఖ పూర్తిగా చదివారా ?? pic.twitter.com/CvCXthJqr8