ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో తోచడం లేదనుకుంటా. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా ఉంది. పైగా ఇప్పుడు కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ తో హైదరాబాద్ ఇంటిలోనే ఉండిపోయారు. ఇక దాని వల్ల బాగా ఖాళీగా ఉండి, జగన్ కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే కుదిరినప్పుడల్లా మీడియా సమావేశం పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలకు వైసీపీ నేతలని నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా వస్తున్నాయి.
అయితే చంద్రబాబు విమర్శలతో పాటు జోకులు కూడా వేస్తున్నారు. అసలు జనంకి అర్ధమవుతుందని లేకుండా, పెద్ద గొప్పలు చెప్పుకుని కామెడీ అయిపోతున్నారు. తాజాగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులకు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. పత్రికా స్వేచ్ఛకు కట్టుబడిన పార్టీ టీడీపేనని, పత్రికా స్వేచ్ఛకు ఎప్పుడు ప్రమాదం వాటిల్లినా టీడీపీ ముందుండి పోరాడిందని చెప్పారు. అలాగే నాడు వైఎస్ హయాంలో, నేడు జగన్ పాలనలో తెచ్చిన జీవోలపై వ్యతిరేకంగా పోరాడామని బాబు కొంచెం భారీ డైలాగులు వేశారు.
అయితే బాబు చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. బాబుకు డప్పు కొట్టుకోవడం ఎక్కువైపోయిందని, గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బాబు చేసినవి గుర్తు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తమకు వ్యతిరేకంగా వార్తలు ఇచ్చే మీడియాని నిలువరించిన సంగతి మరిచిపోయారు అనుకుంటా అని నిలదీస్తున్నారు.
టీడీపీ నేతలు కేబుల ఆపరేటర్లని బెదిరించి ఎన్ని ఛానల్స్ ఆపేశారో తెలుసని అంటున్నారు. ఇక నాడు వైఎస్ హయాంలో, నేడు జగన్ హయాంలో పోరాటం చేశామని చెప్పడం పెద్ద హైలైట్ అని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ తెచ్చిన జీవో మీడియాకు వ్యతిరేకం కాదని, అనవసరంగా ప్రభుత్వం మీద బురద జల్లే వారిని కట్టడి చేయడానికి తీసుకొచ్చారని గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా బాబుని చూస్తే గురివింద సామెత గుర్తొస్తుందని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.