ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా ప్రభావాన్ని ఎంత కట్టడి చేసిన కూడా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు.. జనతా కర్ఫ్యూ లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది..ఈ మేరకు ప్రజలను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది.. అయినా కొంత మంది పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారు అనే దైర్యం తో ముందుకు వస్తున్నారు.. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు మూతపడ్డాయి..
ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.
మే 17 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలను పోలీస్ శాఖ మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది..ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఓ పోలీసు ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సమాజ్ వాదీ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనను కొట్టొద్దని ఆ యువకుడు చేతులెత్తి వేడుకుంటున్నప్పటికీ కనికరం లేకుండా లాఠీతో పోలీసు దారుణంగా కొట్టాడు.
అంతేకాకుండా అతన్ని వదిలేయమని దండం పెడుతున్న కూడా ఆ పోలీసు వదల్లేదు.. తన బూటు కాలితే తొక్కుతూ, తన్నుతూ వచ్చాడు.. కొడుతూ ఆ పోలీసు కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. బాధితుడు సునీల్ యాదవ్ మానసిక స్థితి బాగోలేదని, అతడు తాగుడుకు అలవాటు పడి గ్రామస్థులపై దాడులకు పాల్పడుతున్నాడని చెప్పారు. గ్రామస్థుల నుంచి ఫిర్యాదు అందుకుని ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారని తెలిపారు.దాంతో కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారని తెలుస్తోంది..