ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధించి మరొక సారీ వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ కేసుపై దాదాపు గురువారం వరకు వాదనలు జరగబోతుందని ఈరోజు స్పష్టమైంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరోవైపు ఎన్నికల కమిషనర్ తరఫున.. వాదన వినిపించడం కోసం వాయిదా అడిగితే గురువారానికి వాయిదా వేసింది కోర్టు. ఈ నేపథ్యంలో గురువారం తర్వాత గాని సోమవారం తరువాత కాని దీనికి సంబంధించి ఒక కీలకమైన తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
అయితే ఈ కేసు మొత్తం అత్యంత సున్నితమైన పాయింట్ చుట్టూ తిరుగుతుంది. అది పిటిషనర్ ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా పిటిషన్ లు వేసిన వారి తరఫున.. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఒకరైన అటువంటి జంధ్యాల రవిశంకర్ వాదన మరింత సంచలనాత్మకమైనదిగా ఉంది . అదేంటంటే 243k నిబంధన ప్రకారం.. ఎన్నికల కమిషనర్ నియామకం జరిగింది. ఆయన తొలగించాలంటే అదే నిబంధన ప్రకారం తొలగించాల్సి ఉంటుంది. కానీ కొత్త ఎన్నికల కమిషనర్ నియామకం 200 నిబంధన ప్రకారం జరిగింది. అందుకే అది చెల్లుబాటు కాదు అంటూ వాదిస్తున్నారు.
అదే సందర్భంలో ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు గాని.. కొనసాగింపు కానీ కొత్త ఆర్డినెన్స్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే ఉండాలి అన్న పాయింట్ ని ప్రస్తుతం తెర మీదకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇలాంటి ఆర్డినెన్స్ అనేది అత్యవసర పరిస్థితులలో కానీ శాసన సభ ఏర్పాటుకు అవకాశం లేనప్పుడు మాత్రమే ఇవ్వాలని... కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకుండా అత్యవసరంగా ఆర్డినెన్స్ జారీ చేశారని ఆరోపిస్తున్నారు. ఇక ఈ వాదనలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి.మరి జంధ్యాల మెలికపై ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది