ఈరోజు మధ్యాహ్నం ప్రముఖ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ ప్రముఖ నాయకులెవరూ స్పందించలేదు. అయితే టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ట్విట్టర్ ద్వారా బండ్ల గణేష్ పై ఘాటు పదజాలంతో విమర్శలు చేశారు. పెంట మీద రాయి వేయడం ఎందుకని ఇన్ని రోజులు విమర్శలు చేయలేదని... బ్లేడు బాగోతం బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. 
 
లోకేష్ నయీంతో కలిసి దందాలు చేయలేదని... బ్లేడ్ తో గొంతు కోసే రకం కాదని పేర్కొన్నారు. గొంతు కోసుకోవడానికి 7 o క్లాక్ బ్లేడ్ లేకపోతే డబ్బులు అడుక్కోవాలని విమర్శించారు. ఎన్నికల ముందు వరకు బండ్ల గణేష్ బ్లేడ్ బ్యాచ్ కు హెడ్ గా ఉన్నారని.... ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీటుకు నోటు తీసుకునే స్థాయికి దిగజారిపోయారని అన్నారు. 
 
స్టాన్‌ఫోర్డ్‌లో చ‌ద‌వ‌డ‌మంటే ఎవ‌డో బ‌డాబాబుల సొమ్ముకు బినామీగా వ్య‌వ‌హ‌రించి సినిమా తీసి బ‌డా ప్రొడ్యూస‌ర్ అనిపించుకోవ‌డం కాదని పేర్కొన్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేయడమంటే సినిమా టికెట్ బ్లాక్ లో కొన్నంత సులభం కాదని అన్నారు. నారా లోకేశ్ పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రిగా 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్డు వేయించారని.... . దేశంలో త‌యార‌య్యే ప్ర‌తీ 10 సెల్‌ఫోన్ల‌లో మూడు ఫోన్లు ఏపీలో త‌యార‌వుతున్నాయంటే గతంలో మంత్రిగా పని చేసిన నారా లోకేశ్ గొప్పదనమని అన్నారు. 
 
దేశంలోనే ఉపాధి హామీలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా గతంలో పని చేసిన లోకేశ్ వల్లే ఈ ఘనత సాధ్యమైందని అన్నారు. నారా లోకేశ్ పై ఒక్క అవినీతి కేసు కూడా లేదని అన్నారు. లోకేశ్ మంత్రిగా నిర్వ‌హించిన శాఖ‌ల‌కు అత్య‌ధిక అవార్డులు వ‌చ్చాయని అన్నారు. చివ‌రికి చెక్ బౌన్స్ కేసులు, క్రిమిన‌ల్ గ్యాంగుల‌తో సంబంధాలున్న బండ్ల గ‌ణేష్ కూడా కోట్స్ ట్వీట్ చేస్తున్నాడు ఇదే క‌రోనా కాలం అంటే అని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: