ప్రజాస్వామ్య దేశం అంటే... ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే  ఎన్నుకోబడినది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. అలాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల క్షేమం కోసం ఎలాంటి పరిరక్షణ చర్యలు తీసుకోవడానికి అయినా ముందుడాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు  ప్రస్తుతం ప్రజల ఆరోగ్య సంరక్షణ  విషయంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పేదలకు చేయూతనివ్వడం కరోనా  వైరస్ పేషెంట్ లను గుర్తించి వారికి చికిత్స అందించి ప్రాణాలను కాపాడడం లాంటివి ప్రజల రక్షణ కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నారు. 

 

 కానీ ప్రస్తుతం ఇన్ని రోజుల వరకు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. లాక్ డౌన్ సడలింపులో భాగంగా  మద్యం అమ్మకాలను ప్రారంభించారు. అంటే ప్రస్తుతం దేశంతో పాటు ఆయా రాష్ట్రాలు కూడా ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో మద్యం అమ్మకాలు ప్రారంభించడం ద్వారా ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేసేందుకు మద్యం షాపులను ఓపెన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి  ఆయా రాష్ట్ర ప్రభుత్వాల. అంతే కాకుండా మరికొన్ని సడలింపు కూడా ఇచ్చాయి. 

 

 అయితే ప్రస్తుతం కేవలం మద్యం షాప్ లోనే కాకుండా ఆర్టిఏ రిజిస్ట్రేషన్, వాహనాల కొనుగోలు లాంటివి ఓపెన్ చేస్తున్నప్పుడు గుళ్ళు బళ్ళు ఓపెన్ చేస్తే తప్పేంటి అంటున్నారు విశ్లేషకులు. 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం మంచి తరుణమే అంతేకాకుండా పరీక్ష పత్రాలను వాల్యుయేషన్ చేయడం,  మిగిలిన పరీక్షలను కూడా నిర్వహించడం లాంటివి చేయడంతో పాటు మరోవైపు గుళ్ళు మసీదులు చర్చిలు లాంటివి కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మద్యం షాప్ లో కంటే గుళ్ళు మసీదులు చర్చీల  లోనే ప్రజలు ఎంతో బాధ్యతగా ఉంటారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో భయాందోళనలో ఉన్న ప్రజలందరికీ గుళ్ళు మసీదులు చర్చిలు ఓపెన్ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా దొరికే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: