కరోనా ప్రభావం రోజు రోజుకు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది.. అంతేకాదండోయ్  ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా చేసింది.. దీంతో రెక్కాడితే కానీ పూట గడవని మద్య తరగతి జనాల జీవితాలు అస్తావ్యస్తమయ్యాయి.. పూట గడవాలంటే కష్టతరంగా మారింది.  అలాంటి వారికోసం సేవా సంస్థలు, సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు.. అందుకే ఇప్పుడు కరోనా ప్రభావం కొద్దిగన్న తగ్గిందని చెప్పాలి..


 

 

ప్రజా రవాణా త్వరలో ప్రారంభం అవుతుందని కేంద్రం తెలిపింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 24 నుంచి ఆగిపోయిన ప్రజా రవాణా వ్యవస్థను పున:ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. రవాణా, జాతీయ రహదారుల పునరుద్ధరణ ప్రజలకు భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు. అయితే బస్సులు, కార్లు తదితర వాహనాలు నడపడంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోక తప్పదని అన్నారు.



 

 

అయితే డ్రైవర్లు అలా బస్సులు కార్లల్లో ఎక్కే వారు ఇద్దరు చేతులను పదే పదె కడుక్కోవడం లాంటివి చేయాలని అన్నారు..రవాణా రంగానికి వడ్డీ చెల్లింపు మినహాయింపులు, ప్రజా రవాణా పునరుద్ధరణ, రాష్ట్రాల పన్నుల వాయిదా లాంటి రాయితీలు సమకూర్చాలని సమాఖ్య సభ్యులు మంత్రిని కోరారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.



 

 

అయితే కరోనా దేశ వ్యాప్తంగా తగ్గు ముఖం పడుతున్న నేపథ్యంలో అందరూ మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు..కరోనాపై, ఇటు ఆర్థిక మాంద్యంపై జరుగుతున్న పోరులో భారత్ విజయం సాధించి తీరుతుందని గడ్కరీ పేర్కొన్నారు. కొంత కాలం వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించాల్సిందేనని చెప్పారు.ప్రజల అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: