విదేశాల నుంచి వచ్చే వారిపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్. పటిష్టమైన క్వారంటైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మరో షిప్పింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. మొక్కజొన్న, పసుపు పంటలకు మద్ధతు ధర కల్పించామని తెలిపారు సీఎం జగన్.
కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు జగన్. విదేశాల్లో చిక్కుకుపోయిన వారు భారత్‌కు వస్తున్నారని అధికారులకు గుర్తు చేశారు.
విదేశాల నుంచి వచ్చే వారి క్వారంటైన్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. క్వారంటైన్ చేసిన తర్వాతే.. స్వస్థలాలకు పంపాలని స్పష్టం చేశారు. ఆయా దేశాల్లో కరోనా తీవ్రత ఆధారంగా.. విదేశాల నుంచి వచ్చేవారిని వర్గీకరించాలన్న జగన్.. గల్ఫ్ నుంచి వచ్చేవారి క్వారంటైన్ పైనా దృష్టి పెట్టాలని చెప్పారు. నియోజవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 75 వేల పడకలను క్వారంటైన్‌కు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. క్వారంటైన్ కేంద్రాలను లక్ష వరకు పెంచాలని అధికారులను ఆదేశించింది ఏపీ సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 కోట్లకు పైగా మాస్క్‌లు పంపిణీ చేసింది.
కరోనా కాకుండా ఇతర కేసులు ప్రతి రోజూ ఎన్ని వస్తున్నాయన్న దానిపై వివరాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. మరింత సక్సెస్‌ఫుల్‌గా టెలి మెడిసిన్‌ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బైకులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై కూడా జగన్ చర్చించారు. 10 వేల టన్నుల బత్తాయిల కొనుగోలుకు రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రిటైల్ అమ్మకాల్లో ప్రభుత్వ నుంచి కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనకు సీఎం అంగీకారం తెలిపారు. పసుపు, మొక్కజొన్నకు కనీస మద్ధతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న పసుపు, మొక్కజొన్న పంటలు నివారించడంపై చర్చించారు. రాష్ట్రంలో మరో షిప్పింగ్ హార్బర్, 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అనుమతి లభించింది. విజయనగరం జిల్లాలో షిప్పింగ్ హార్బర్‌కు సీఎం అనుమతి ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో మొత్తం షిప్పింగ్ హార్బర్ల నిర్మాణ సంఖ్య తొమ్మిది చేరింది. విశాఖ జిల్లాలోని భీమిలి, నక్కపల్లిలో మరో 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.