ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో  ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరుపై ఏకంగా రాజకీయ విశ్లేషకులు కూడా భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలి అనుకున్నప్పుడు.. ముందుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పర్మిషన్ తీసుకోవలసి ఉంటుంది. కానీ నేను రావాలి  అనుకున్నాను కానీ రాలేని పరిస్థితిలో ఉన్నాయి అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇవ్వడం పై రాజకీయ విశ్లేషకులు కూడా భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

 


 అయితే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన పర్మిషన్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి అని చంద్రబాబు తెలిసిందని కానీ ఆనాడు టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినది అని  ఓ వాదన చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోకి రావాలంటే మొట్టమొదటి పర్మిషన్ ఆంధ్రప్రదేశ్ డిజిపి నుంచి పర్మిషన్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ డిజిపి కి లెటర్ పెట్టుకుంటే ఆ తర్వాత... పర్మిషన్ వచ్చాక కేంద్ర ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగాలి . కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రావాలి అనుకుంటున్నాము కానీ రాలేకపోతున్నాను అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఎవరిని దోషిని  చేయడానికి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 

 


 అంటే కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ ఇవ్వలేదు అని దోషిగా చూపిస్తారా లేదా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అని దోషిగా చూపిస్తారా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రంలోకి  రావడానికి వీలు లేదు అంటూ ఆనాడు  వాదించిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం... పర్మిషన్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరడం విడ్డూరంగా ఉంది  అంటున్నారు విశ్లేషకులు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన తొందరగా వెళ్లి బాధితులను పరామర్శించి ఉంటారనే విషయం తెలిసిందే. అయితే ఒక రాజకీయ నాయకుడిగా ఇలాంటివన్నీ చేయడం తప్పు లేదు కానీ.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం చర్చనీయాంశంగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: