సృష్టిలో ఎవరికీ దక్కని అపూర్వ బహుమతి మనుషులకు లభిస్తుంది.  ఆ బహుమతి ఏమిటి అని ఆలోచిస్తున్నారా అమ్మ.. అమ్మ అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి ఆత్మీయత, అభిమానం, అనురాగం అంతకు మించి మనకు స్ఫూర్తిగా నిలిచేదే అమ్మ. అమ్మ పంచే ప్రేమ ఎప్పటికీ వర్ణించలేనిది. వాస్తవానికి అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అని చెప్పాలి. వాస్తవానికి ప్రపంచంలో మనం అపురూపంగా చూసుకోవాల్సిన వ్యక్తి ... కేవలం అమ్మే..! 

 

అమ్మ తరువాతనే ఎవరైనా కూడా... దేవుళ్ళు దేవతలు అమృతం తాగి అమరజీవి అయ్యారు... కానీ వారికి అమ్మ ప్రేమ ఎప్పుడూ దక్కలేదు. అలాంటి అమ్మ ప్రేమను మనకు లభిస్తుంది. అమ్మ మనకు అమృతం ఇవ్వలేకపోవచ్చు కానీ అంతుపట్టని ప్రేమను ఇస్తుంది. కనిపించే దేవుళ్ళలో మొట్టమొదటి స్థానంలో అమ్మ నిలుస్తుంది. నిజానికి అమ్మ ప్రేమ అద్భుతం, అపురూపం. ఇక పురాణాలు కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ అని ముందుగా అమ్మకి బాగా నేత ఇస్తారు. నిజానికి మన పెద్దలు కూడా అమ్మకే అగ్ర మూలాలు కూడా అందజేస్తారు. ప్రేమ ఎప్పటికీ ఒకేలాగ ఉంటుంది అమ్మ అంత గొప్పది. కష్టాలలో ఉన్న తన బిడ్డలను నిరంతరం ఓదారుస్తుంది.. ఉన్నత శిఖరాలను సాధించాలని కోరుకోవడంలో మొదటి స్థానంలోనే అమ్మ ఉంటుంది. పిల్లల విజయాన్ని తన విజయంగా భావిస్తూ అమ్మ తృప్తి చెందుతుంది.

 

ఇక తన బిడ్డలకు బాధ కలిగితే మాత్రం అమ్మ చాలా విల విల లాడి పోతుంది. అంతేకాకుండా బిడ్డల ఆరోగ్యం పట్ల. తన ప్రేమతో వారి బిడ్డల ఆరోగ్యం మెరుగు పరుస్తుంది. నిజానికి అమ్మ మాత్రమే మనము అడగకుండా కూడా భోజనం పెడుతుంది... మన కడుపు నింపడానికి కొన్ని సందర్భాల్లో అమ్మ పస్తులు కూడా ఉంటుంది. ఇంట్లో కానీ, ఊర్లో కానీ ఏదైనా అల్లరి పని చేస్తే.. సమర్ధించుకుంటూ వచ్చేది అమ్మ మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: