దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో నిన్న 43 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1930కు చేరింది. ఇప్పటివరకు 44 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఏపీ సర్కార్ ప్రజలకు తొలి విడతగా మార్చి 29న బియ్యం, కందిపప్పు... ఏప్రిల్ 16న బియ్యం, శనగలు.... ఏప్రిల్ 29 నుంచి ఈ నెల 10 వరకు బియ్యం, కందిపప్పు సరఫరా చేస్తోంది. 
 
కేంద్రం లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడిగించడంతో జగన్ సర్కార్ మరోసారి ఉచిత సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో బియ్యం, కందిపప్పు సరఫరా చేయనుంది. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం బియ్యం, శనగలు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయనుందని తెలుస్తోంది. 
 
ఇప్పటికే పలు జిల్లాల్లో సరుకులను రేషన్ దుకాణాలకు తరలించే ప్రక్రియ మొదలైంది. లాక్ డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా బియ్యం, శనగలు పంపిణీ చేస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు సడలించి వ్యాపార, వాణిజ్య సంస్థలు నష్టపోకుండా చర్యలు చేపడుతోంది. 
 
ప్రభుత్వం అదే సమయంలో ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న 43 కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1930కు చేరింది. ఇప్పటివరకు 44 మంది రాష్ట్రంలో కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: