మనుషుల్లో మానవత్వం పూర్తిగా తగ్గిపోయింది.. ఒకప్పుడు ఎలా ఉందంటే ఎం చేసిన కూడా పది మంది మంచిగా ఉంటె చాలు అని అనుకునేవారు కానీ ఇప్పుడు చూస్తే.. ఏదైనా కూడా స్వార్థంత్తో చేస్తున్నారు.. మన సంతోషం చాలు అనుకోని  బ్రతుకుతున్నారు. అంతేకాకుండా మనుషులలో ఒకరు బాగుపడితే తట్టుకోలేని విదంగా మారిపోయారు.అందుకే క్రైం రేటు కూడా పూర్తిగా పెరుగుతుంది. 

 

 

 

ఓ వ్యక్తి ని గుర్తు తెలియ ని వ్యక్తులు అతి కిరాతకం గా చంపినా ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. అలిపిరి సమీపం లోని బాలాజీ టూరిస్టు లింకు బస్టాండు వద్ద ఓ యువకుడు హత్య కు గురైనట్లు అలిపిరి ఎస్‌ఐ వినోద్‌ కుమార్‌ సోమవారం తెలిపారు. తమిళనాడు పళ్లిపట్టు సమీపం గాజుల కండ్రిగకు చెందిన రమేష్‌(25) మూడేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం తిరుపతి కి వచ్చాడు. ఇక్కడే ఉంటూ నిత్యం టూరిస్టు బస్సులు శుభ్రం చేయడం, ప్రైవేటు జీపులకు లోడ్‌ చేయడం చేస్తూ వచ్చే సంపాదన తో జీవిస్తున్నాడు.

 

 

 

అయితే అతని ప్రవర్తన కూడా బాగుండేదని  చుట్టూ పక్కల వాళ్ళు చెప్పొకొచ్చారు.అలాంటి వ్యక్తి సోమవారం ఉదయం రమేశ్‌ విగత జీవి గా పడి ఉండటాన్ని గమనించిన కొందరు అలిపిరి పోలీసుల కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడి కి చేరుకుని పరిశీలించారు. ముందు రోజు అర్ద రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలమైన ఆయుధాలతో రమేష్‌ తలపై దాడి చేచి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బస్టాండ్‌లో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని మరణం వెనక గల కారణాలు ఇంత వరకు తెలియడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: