విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై రెచ్చగొట్టే విమర్శలు చేయకుండా బాధ్యతగా స్పందించారు. కొందరు రసాయన శాస్త్రవేత్తలతో పవన్ కళ్యాణ్ గ్యాస్ లీకేజీ గురించి చర్చించగా వారు పవన్ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచారు. పవన్ కంపెనీ, ప్రభుత్వం ఆ ప్రశ్నలకు సమాధానమివ్వాలని కోరారు.
1. స్టైరీన్ తో నిండిన ట్యాంక్ ఉష్ణోగ్రతలు లాక్ డౌన్ సమయంలో ఎందుకు పర్యవేక్షించలేదు...?
2. ఎల్జీ పాలిమర్స్ నిర్వాహకులు స్టైరీన్ యొక్క ఆటో పాలిమరైజేషన్ గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుచ్చారా..?
3. ప్లాంట్ మూసివేసే సమయంలో ఆపరేషన్స్ మేనేజర్ ఆటో పాలిమరైజేషన్ గురించి మేనేజ్మెంట్ తో చర్చించారా...?
4. ప్లాంట్ మూసివేసిన రోజు ట్యాంక్ ను తనిఖీ చేశారా...? లేదా...?
5. ట్యాంక్ నుంచి ఆవిరి లీకేజీలను తనిఖీ చేయడానికి ఏదైనా సరైన విధానం ఉందా...?
6. మే 6వ తేదీన ట్యాంక్ ఉష్ణోగ్రత ఎంత...?
7. ట్యాంక్ ఉష్ణోగ్రత తెలుసుకోవడం, నిర్వహణ కొరకు ఏదైనా ఆన్ సైట్ అత్యవసర ప్రణాళిక తయారు చేసిందా...?
8. ఆన్ లైన్ అత్యవసర ప్రణాళిక ఉందా...? ఆ ప్రణాళికను ఎవరు ఆమోదించారు.
9. ప్లాంట్ లో ఆపరేటింగ్ సిబ్బంది అందరూ శిక్షణ పొందారా..?
10. ట్యాంక్ నుండి స్టైరీన్ ఆవిర్లు కారుతున్నట్టు ఏదైనా ఫిర్యాదు వచ్చిందా...?
11. ఫ్యాక్టరీలో సైరన్ వ్యవస్థ ఉందా..? ఉంటే సైరన్ ఎందుకు మోగలేదు..?
12. రెండవ ట్యాంక్ లో ఆటో పాలిమరైజేషన్ ఎందుకు జరగలేదు....?
13. యాజమాన్యం స్థానిక ప్రజలను ఎందుకు అప్రమత్తం చెయ్యలేకపోయింది...?
14. గతంలో ఎప్పుడైనా స్టైరీన్ ట్యాంక్ లో ఆటో పాలిమరైజేషన్ జరిగిందా...?
15. ధృవీకరణ మరియు లైసెన్స్ తో డిజైన్ కాపీలు ఉన్నాయా...?