
నిన్న సాయంత్రం భారత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నరేంద్ర మోడీ ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల ఆర్థిక పాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. చిన్న మధ్య తరహా అభివృద్ధి కోసం పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడిస్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా చిన్న మధ్య తరహా పరిశ్రమలపై కేంద్రం ఎక్కువగా దృష్టి సారించాము అంటూ ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు అందించి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వడం కోసం ఏకంగా మూడు లక్షల కోట్లను ఈ చిన్న తరహా పరిశ్రమల కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఎలాంటి గ్యారెంటీ లేకుండా కరుణాలు అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా పేద మధ్యతరగతి ప్రజలకు కూడా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది అంటూ ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. వలస కూలీల చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక తీసుకుంది అంటూ తెలిపారు నిర్మలా సీతారామన్ .
పేదలు, వలస కూలీలు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఇది ఫలితాలను ఇచ్చాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు . స్థానికతకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఆర్ధిక, మౌలిక, దేశ జనాభా, డిమాండ్, సాంకేతికత అనే ఐదు సూత్రాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఉంటుంది అంటూ తెలిపారు నిర్మల సీతారామన్. అంతే కాకుండా దేశంలోని యువ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు నిర్మల సీతారామన్.