తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మడ అడవుల నరికివేతపై వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఇళ్ల స్థలాలకు భూములు సేకరించడం చేతకాక, మడ అడవులు నరికివేస్తారా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ఫైర్ అయిపోతున్నారు. మడ అడవులను ఇలా నరికేస్తే రేపు తుపాను వచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటి? ఇలాంటి చోట ఇళ్లు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఏంటి? అని బాబు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై తూర్పుగోదావరి టీడీపీ నేతలు పోరాటం కూడా చేస్తున్నారు. ఇక బీజేపీ నేత సోము వీర్రాజు దీనిపై స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కు లేఖ కూడా రాసారు. ఈ విషయంలో అటు టీడీపీ తో పాటు ఇటు బీజేపీ నేతలు కూడా ఒక్కటై మరీ అధికార వైసీపీ పై పోరాటం చేస్తున్నారు. కాకినాడ ను రక్షించే మడ అడవులను నరికి వేస్తే రేపు తీవ్రమైన తుఫాన్లు వస్తే కాకినాడ ప్రజల గతేంగాను అంటూ గొంతెత్తుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఓ ఇద్దరు మేధావులు మాత్రం బయటకు రావడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తూర్పుగోదావరికి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్, ముద్రగడ పద్మనాభంలు ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. మీకు జగన్ పై అంత ప్రేమ ఎందుకని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బాబును టార్గెట్ గా చేసుకుని ఎన్నెన్నో విమర్శలు చేసిన ఈ ఇద్దరు మేథావులకు ఇంత జరుగుతున్నా... జగన్ సర్కార్ పర్యావర ణానికి తూట్లు పొడుస్తున్నా ఎందుకు పట్టడం లేదని ఫైర్ అవుతున్నారు. మొత్తానికైతే ఈ ఇద్దరు మీద తెలుగు తమ్ముళ్లు బాగా కోపంగా ఉన్నట్లున్నారు.