మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు ఎప్పుడు ముక్కుసూటి వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆయన ఎవరి పై ఎలాంటి వ్యాఖ్యలు చేయాలి అన్న మనసులో అనిపించింది మాట్లాడుతూ ఉంటారూ. నిర్మొహమాటంగా అన్ని ముక్కుసూటిగా చెబుతూ ఉంటారు. విమర్శలు వచ్చినప్పటికీ ఆయన తీరును మాత్రం ఎప్పుడు మార్చుకోకుండా తనదైన శైలిలోనే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు సంచలన వ్యాఖ్యలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు మెగాబ్రదర్ జనసేన నేత నాగబాబు.. ఇక తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారిపోయాయి.
ఈరోజు నాథురం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా.. ఎవరు స్పందించని విషయం పై నాగబాబు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాథురం గాడ్సే నిజమైన దేశభక్తుడు... అయితే నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేయడం కరెక్టా కాదా అన్నది డిబెటబుల్.. కానీ అతను వైపు వాదనలు మాత్రం అప్పుడు ఎవరూ వినలేదు. ఆనాడు మీడియా సంస్థలు కూడా అతని వాదన పట్టించుకోలేదు. కేవలం అధికార పార్టీకి లోబడి మాత్రమే అప్పటి మీడియా పని చేసింది. ఇక ప్రస్తుతం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నవి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు
అయితే గాంధీ ని చంపితే అప్రతిష్ఠ మూటకట్టుకోవలసి వస్తుంది అని తెలిసినప్పటికీ నాధూరాం గాడ్సే అనుకున్నది చేసి చూపించాడు. నిజమైన దేశభక్తుడు అయిన నాథురం గాడ్సే దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదు. నాథురం గాడ్సే ఆత్మకు శాంతి చేకూరాలి గాక అంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే దీనిపై స్పందించిన విశ్లేషకులు ఏమంటున్నారంటే... మెగా బ్రదర్ నాగబాబు కి నిజంగా తెగింపు ఎక్కువ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే గాడ్సే లాంటి వారి విషయంలో స్పందించడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీలే వెనకడుగు వేస్తుంటే నాగబాబు మాత్రం.. ఎంతో ధైర్యంగా తెగింపుతో గాడ్సే గురించి మాట్లాడారు అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.