రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజకీయ రంగు పులుముకోవడం, రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిందే. కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకెళ్లే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు కు సంబంధించి కృష్ణ రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం వివరణ కోరుతూ కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. అలాగే దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏపీ ప్రభుత్వం వివరణ కోరింది. అంతేకాకుండా దీనికి సంబంధించి నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మరో రెండు నెలల్లోగా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదంలో వాస్తవాలను పరిశీలించి కోర్టుకు నివేదించారు. ఆ తరువాత దీనికి సంబంధించి కోర్టు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. 

IHG

 

ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒక వేదిక మీదకు తెచ్చి సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అపెక్స్ కౌన్సిల్ లో  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ సభ్యులు గా ఉన్నారు. జనవరిలో జరిగిన ఓ సమావేశంలో రెండు రాష్ట్రాలు ఒకే తేదీని అనుకుని ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించాలని ముందుగా భావించాయి. అప్పుడు చెప్పినట్టుగానే రెండు రాష్ట్రాలు త్వరలో తమ అజెండాను పంపాలని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

 

 రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి మాట్లాడితే జల వివాదాలు పరిష్కారం అవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ తో తమకు ఎటువంటి పేచీలు లేవని, ఏపీ ప్రభుత్వంతో తాము సామరస్య పూర్వకంగానే అన్ని విషయాల్లో కలిసి ముందుకు వెళ్తున్నాము అంటూ  ప్రకటించారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగానే ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: