కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను చిగురుటాకులాగా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టడం కొరకు అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ గురించి కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలో భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
తాజాగా కరోనాతో మరణించిన వారి ఊపిరితిత్తుల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాకు చెందిన బ్రిగ్ హామ్ ఉమెన్స్ చేసిన అధ్యయనంలో కరోనాతో మరణించిన ఏడుగురి ఊపిరితిత్తులను పరిశీలించారు. ఈ ఏడుగురి ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ లేదని.... ఫలితంగా ఊపిరితిత్తుల్లోని రక్త కణాలను కప్పి ఉంచే ఎండోథెలియన్ కణాలు దెబ్బ తిన్నాయని అన్నారు. 
 
మృతి చెందిన రోగుల్లో రక్తం గడ్డ కట్టడంతో పాటు కొత్త కణాల పెరుగుదల కూడా కనిపించిందని చెప్పారు. రక్త కణాలు దెబ్బ తినడం వల్ల కొంతమంది రోగుల్లో కాలి వేళ్లు నీలి రంగులోకి మారాయని చెబుతున్నారు. కరోనాతో మృతి చెందిన పిల్లల్లో కవాసాకి సిండ్రోమ్ లాంటి విచిత్ర లక్షణాలు బయటపడ్డాయని చెబుతున్నారు. మృతి చెందిన వారి ఊపిరితిత్తుల్లో కనిపిస్తున్న ప్రత్యేక లక్షణాలు వ్యాక్సిన్ ను కనిపెట్టడాయని సహాయపడతాయని చెబుతున్నారు. 
 
మరోవైపు దేశంలో నిన్న ఒక్కరోజే 6,088 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,18,447కు చేరింది. దేశవ్యాతంగా 3,583 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. నిన్న ఏపీలో 62 కరోనా కేసులు, తెలంగాణలో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2514కు చేరగా తెలంగాణలో 1761కు చేరింది. ఏపీలో 55 మంది కరోనా భారీన పడి మృతి చెందగా తెలంగాణలో 48 మంది మృతి చెందారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: