దేశంలో లాక్ డౌన్ అమలులోకి వచ్చి నేటితో రెండు నెలలు పూర్తైంది. ఇప్పటికే కేంద్రం మూడుసార్లు లాక్ డౌన్ ను పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ అమలవుతోంది. మూడో విడత లాక్ డౌన్ లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా భారీ సడలింపులను అమలు చేస్తోంది. మరోవైపు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నా కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
దేశంలో రికార్డు స్థాయిలో గత రెండు మూడు నుంచి 6,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలో 3,000 కేసులు నమోదవుతున్నాయంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గడచిన 24 గంటల్లో దేశంలో 6767 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. దీంతో కరోనా కేసుల సంఖ్య 1,31,668కు చేరింది.
లాక్ డౌన్ వల్ల పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ వల్ల కేంద్రం భారీగా కేసులు పెరుగకుండా అడ్డుకుంది. ప్రజల్లో కరోనాపై పూర్తి అవగాహన కలిగేలా చేసింది. లాక్ డౌన్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం యొక్క ప్రాధాన్యత తెలిసేలా చేసింది. ప్రస్తుతం పజలు స్వచ్చందంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు.
రోడ్లపైకి వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించాలనే ప్రజలు కూడా కోరుతున్నారు. అదే సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. లాక్ డౌన్ వల్లే దేశంలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాలుగో విడత లాక్ డౌన్ అనంతరం కేంద్రం లాక్ డౌన్ ను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.