ఏడాది పాలన పూర్తి చేసుకున్న జగన్.. ఈనెల 30 న మరో సంచలానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చే విధంగా రైతుభరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. రైతుల దగ్గర నుంచి దళారీ వ్యవస్థను పూర్తిగా తీసివేయడమే లక్ష్యంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రైతు పంట పండించే చోటే పంట కొనుగోలు చేస్తారు.

 

 

రైతు భరోసా కేంద్రాలు గ్రామ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయని జగన్ సర్కారు నమ్ముతోంది. దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుల ముందులు రైతుకు అందుబాటులో ఉంటాయి. గవర్నమెంట్‌ స్టాంప్‌ వేసి ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయించే కార్యక్రమం ఆర్‌బీకేల ద్వారా చేస్తారు.

 

 

అంతే కాదు.. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ ఉంటుంది. ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆర్‌బీకేలో టీవీ.. చిత్రాలు అన్నీ ఉంటాయి. ప్రతి రైతుకు సూచనలు, సలహాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆర్‌బీకే విజ్ఞాన, శిక్షణ కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేర్పించేందుకు ఆర్‌బీకేల ద్వారా నాంది పలుకుతున్నారు.

 

 

ప్రతి ఆర్‌బీకే కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ఉంటాడు. గ్రామ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ ఉంటాడు. వీరిద్దరూ కలిసి పంట వేసేటప్పుడే ఈక్రాపింగ్‌ చేస్తారు. రైతుకు పంట రుణాలు ఇప్పిస్తారు. ఈ క్రాపింగ్‌ ద్వారా ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ కూడా ఆర్‌బీకే కేంద్రం చేస్తుంది. ఆర్‌బీకేలోనే పూర్తిగా ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర అని బోర్డు ప్రదర్శిస్తాం. ఆ గ్రామంలో ఏ రైతుకయినా గిట్టుబాటు ధర రాకపోతే ఆర్‌బీకేలోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ దగ్గర ఒక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఉంటుంది.

 

 

ప్రతి రోజు ఏ పంట పరిస్థితి ఏమిటీ.. ఎన్ని పంటలు వేశారు..ఆ పంటలకు గిట్టుబాటు ధర వస్తుందా.. లేదా..? ఆ పంటల్లో మనం ఇంటర్వీన్‌ కావాల్సిన అవసరం ఉందా..? రైతు నష్టపోకుండా పంట అమ్ముకుంటున్నాడా..? అని ప్రతి రోజూ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సమాచారం పంపించాలి. ఈ ఆర్‌బీసీల నియంత్రణ కోసమే జిల్లాకు ఒక జాయింట్‌ కలెక్టర్‌ను నియమించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: