ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా సోకిన తొలి రోజుల నుంచి మన దేశంలో కరోనాకు విరుగుడుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇతర దేశాలకు కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్ భారీ స్థాయిలో ఎగుమతి అవుతోంది. భారత్ లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వినియోగించడం వల్లే కరోనా మరణాల రేటు, కరోనా కేసుల రేటు తక్కువగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కరోనా నివారణ కోసం హైడ్రాక్సీ క్లోరోక్విన్ చక్కగా పని చేసిందని చెప్పారు. బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి సైతం కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ చక్కగా పని చేస్తుందని చెప్పారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం హైడ్రాక్సీ క్లోరోక్విన్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా సోకిన వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడవద్దని... క్లినికల్ ట్రయల్స్ కూడా చేయవద్దని సూచించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రాస్ లాన్సెట్ నివేదికలో కరోనా సోకిన వారికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తే చనిపోయే అవకాశాలు ఎక్కువ అని తేలడంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించవద్దని ప్రపంచ దేశాలకు ఆదేశాలు జారీ చేసింది. టెడ్రోస్ మాట్లాడుతూ హైడ్రాక్సీ క్లోరోక్విన్ గుండెపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలను ప్రపంచ దేశాలు లెక్క చేయడం లేదు.
చైనా ప్రోద్బలంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇతర దేశాలు భారత్ నుంచి మాస్కులు, కిట్లు, కరోనాకు మందులు దిగుమతి చేసుకుంటున్నాయి. భారత్ మార్కెట్ ను దెబ్బ తీయాలని చైనా ఇప్పటికే నేపాల్ ను, పాక్ ను రెచ్చగొడుతోంది. ప్రపంచ దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాటలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.