స్టార్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని చెప్పారు. వైసీపీ చాలా దారుణంగా వ్యవహరిస్తోందని... ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా...? లేదా...? అనే అనుమానాలు వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొందని చెప్పారు. 
 
టీడీపీ కార్యకర్తలే ఎన్టీఆర్ వారసులని బాలయ్య అన్నారు. తన అవసరం ఎక్కడుంటే తాను అక్కడ ప్రత్యక్షం అవుతానని బాలయ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎన్టీఆర్ కలలను సాకారం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం అని... టీడీపీకి ఉన్నంత మంది కార్యకర్తలు మరే పార్టీకి లేరని వ్యాఖ్యలు చేశారు. 
 
తన చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ సేవకు... పార్టీ కార్యకర్తలకు జీవితాన్ని అంకితం చేస్తామని అన్నారు. ప్రజలే అరాచక శక్తులకు బుద్ధి చెబుతాయని.. ఈ అరాచక పాలన అంతానికి 5 ఏళ్లు అవసరం లేదని అన్నారు. ప్రతి తెలుగువాడికి ఎన్టీఆర్ జయంతి పండగ రోజని చెప్పారు. ఆదర్శాలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు. తెలుగువారికి ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని చెప్పారు. 
 
తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు టీడీపీ ద్వారా ఎన్టీఆర్ పెంచారని అన్నారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఎన్టీఆర్ తెచ్చారని చెప్పారు. బాలయ్య రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పెద్దగా విమర్శలు చేయలేదు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య జగన సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: