భారత దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకూ ప్రపంచంలోనే తక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఉన్న భారతదేశం ప్రస్తుతం మాత్రం ప్రపంచంలో ఎక్కువ కేసులు నమోదైన జాబితాలో చేరిపోయింది . మొన్నటి వరకు దేశంలో అతి తక్కువ కేసులు మాత్రమే నమోదవగా.... తక్కువ సమయంలోనే దేశంలో భారీ మొత్తంలో కేసులు వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. అయితే మొదట్లో అగ్రరాజ్యాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంటే భారత్లో మాత్రం కేవలం 20 వేల కేసుల దగ్గర కొన్ని రోజుల వరకు ఆగాయి కరోనా కేసులు... దీంతో భారత్లో కరోనా ఉద్ధృతి తగ్గింది అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఊహకందని ఈ విధంగా కొత్త కేసులు వెలుగులోకి రావడం అందరినీ షాక్ కి గురి చేసింది .
అయితే భారతదేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మహమ్మారి వైరస్ కంట్రోల్లోనే ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు మాత్రం చేయి దాటిపోతున్నాయి . ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు ఏకంగా దేశానికి శాపం గా మారిపోతున్నాయి. ఏకంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారతదేశంలో లక్ష దాటిపోయిందని దేశ ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్న నేపథ్యంలో లక్షల కేసులు కాస్త లక్షన్నర కేసులకు పెరిగిపోయాయి. దీంతో భారత ప్రజానీకం మొత్తం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక కొన్ని రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది.
అయితే మొన్నటికి మొన్న లక్షల కేసులు దాటిపోయిన తరువాత ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ చేరింది . ఇక కరోనా ఉధృతి అసలు ఎక్కడ తగ్గుముఖం పట్టకపోవడంత... రోజుకు దాదాపు ఏడు వేల కొత్త కేసులు నమోదు అవుతుండటంతో ఇప్పటివరకు ఏకంగా 1, 65,799 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాలలో 9 వ స్థానం లోకి వెళ్ళింది భారతదేశం. ఈ జాబితాలో తొలి స్థానంలో 17 లక్షల కేసులతో అగ్రరాజ్యం అమెరికా నిలవగా... ఆ తర్వాత బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ఉన్నాయి. ఇక మరణాల సంఖ్య లో కూడా చైనాను భారత్ అధిగమించింది. దీంతో రోజురోజుకు భారత్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.