పార్టీ స్థాపించి ఇన్ని సంవత్సరాలు అయినా, దానిని ఏవిధంగా ముందుకు నడిపించాలి అనే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇంకా అర్థం అయినట్టు గా కనిపించడం లేదు. రాజకీయ పార్టీ అధినేతగా బాధ్యతాయుతంగా స్టేట్మెంట్లు ఇవ్వాల్సి ఉన్నా, పవన్ మాత్రం ప్రతి విషయాన్ని సిల్లీగా తీసుకుంటూ నవ్వులపాలవుతున్నారు. ఇప్పటికీ జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేయలేకపోతున్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీగానే జనసేన ముందుకు తీసుకెళ్తున్నారనే విమర్శల నుంచి బయటపడలేకపోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఏ చిన్న లోపం కనిపించినా పవన్ స్టేట్మెంట్ వచ్చేస్తుంది. ఆ విషయంపై తాము ఉద్యమిస్తామని, ఊరికే వదిలిపెట్టేది లేదు అంటూ పవన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ చివరకు ఆ అంశంపై పోరాడుతున్నారా అంటే అదీ లేదు. 

IHG

గతం నుంచి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు అండగా నిలిచేందుకు పవన్ రెండు రోజుల పాటు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి 48 గంటలు డెడ్ లైన్ విధించి హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి కే పవన్ ను మిత్రపక్షంగా చూస్తున్న టిడిపి వెంటనే కిడ్నీ బాధితులకు పెన్షన్ పథకాన్ని ప్రకటించారు. ఇదంతా తన వల్లే సాధ్యమైందని కూడా భావించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రాంతంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి.వారికి వైద్యపరంగా కూడా అంతంతమాత్రంగానే సేవలు అందుతున్నాయి.కానీ ఆ విషయాన్ని ఇప్పటికీ పవన్ పట్టించుకోకుండా వదిలేశారు. 

IHG

అలాగే రాజధాని రైతుల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు రాజధాని విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ పవన్ స్టేట్మెంట్స్ ఎక్కడా  కనిపించడం లేదు. అప్పట్లోనే అమరావతి రైతులకు సంఘీభావం,  లాంగ్ మార్చ్ ప్రకటించిన పవన్ ఇప్పుడు ఆ ఊసు ఎత్తడం లేదు. ఇక కొద్ది రోజుల క్రితం విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా నిలబడతాం అంటూ ప్రకటించారు. అప్పటికి ప్రభుత్వం ఈ ఘటనలో మరణించిన బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం, అలాగే ఎల్ జి పాలిమర్స్ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలకు కుటుంబానికి పదివేలు చొప్పున పరిహారం కూడా అందించారు. 

IHG

ఇక్కడ పవన్ ఉద్యమించేందుకు ఏ అవకాశం లేదు. కానీ ఎందుకు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలా ప్రతి సందర్భంలోనూ పవన్ సిల్లీగా స్టేట్మెంట్లు ఇవ్వడం, తర్వాత వాటిని మర్చిపోవడం పరిపాటిగా మారడంతో సొంత పార్టీ కార్యకర్తలు కూడా అసహనానికి గురవుతున్నారు. ఏదో ఒక విషయంపై క్లారిటీ గా ముందుకు వెళ్తే మంచిదని, అన్ని విషయాల్లో వేలు పెట్టి ఆ తరువాత ఆ సంగతి మర్చిపోవడం వంటివి చేస్తే విలువ ఉండదని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: