మహిళలను కాపాడటానికి ఎన్నో చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్న కూడా కామాంధుల రక్త దాహం మాత్రం తీరలేదు.. రోజు రోజుకు మహిళల పై అఘాయిత్యాలు పెరుగుతూ వస్తున్నాయి.. ఒక వైపు కరోనా ప్రజలను చంపేస్తున్న కూడా మరో వైపు కామాంధుల రాక్షసత్వం రోజు రోజుకు పెరుగుతోంది..లేచినప్పటి నుంచి పడుకొనే వరకు ఏదోక వార్త ప్రజలను కదిలించి వేస్తుంది.. 

 

 

 


ఇకపోతే కొవిడ్ ఆసుపత్రిలో కుడా కామాంధులు వదలడం లేదు అంటే అవాక్కవ్వాల్సిన విషయమే.. కామంతో కళ్లుమూసుకుపోయి జూనియర్ లేడీ డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టాడో ప్రబుద్ధుడు. సీనియర్‌ డాక్టర్‌గా వైద్య సేవలందించడంలో సూచనలు చేయాల్సిందిపోయి కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఒప్పుకోకపోవడంతో రేప్ చేసేందుకు ప్రయత్నించాడు. అది కూడా కోవిడ్ ఆస్పత్రిలో కావడం గమనార్హం. కరోనా మహమ్మారితో ముందుండి పోరాడుతున్న వైద్యులను దేవుళ్లుగా కొలుస్తున్న ఇలాంటి విపత్కర సమయంలో కామంతో రెచ్చిపోయి వైద్యవృత్తికే కళంకం తెచ్చాడు. 

 

 

 

జూనియర్ రెసిడెంట్‌గా పనిచేస్తున్న మహిళా వైద్యురాలిపై సీనియర్ డాక్టర్ అత్యాచారానికి యత్నించిన దారుణ ఘటన రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో జరిగింది. పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని రిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సీనియర్ అయిన డాక్టర్ ఆమెపై కన్నేశాడు. తరచూ వేధింపులకు గురిచేసేవాడు.

 

 

 

డాక్టర్ ఎప్పటి లాగే నైట్ డ్యూటీ కి వచ్చింది. ఒంటరిగా ఉన్నపై కామాంధుడు కన్ను వేసాడు..  ఆమెను గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెపై పడి పశువాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ఆమె కేకలు పెట్టడంతో నోరుమూసి అత్యాచారం చేసేందుకు విఫల యత్నం చేశాడు. ఎలాగో తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను రేప్ చేసేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: