ఏపీలో రాష్ట్రఎన్నికల కమిషనర్ కూ జగన్ సర్కారు ఉన్న జగడం గురించి తెలిసిందే. అయితే ఈ కేసులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది. మళ్లీ నిమ్మగడ్డే ఎస్‌ఈసీగా నియమించాలని హైకోర్టు సూచించింది. కానీ ఈ తీర్పు రుచించని జగన్ సర్కారు సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.
అయితే ఈ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో రమేశ్ కుమార్ కంటే ఎక్కువగా టీడీపీ నేతలే స్పందిస్తుండటంపై వైసీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన నిమ్మగడ్డ రమేష్.. వాయిదా వేసేటప్పుడు ఎందుకు సంప్రదించలేదని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖలో సీఎం వైయస్ జగన్ ఫ్యాక్షనిస్టు అన్నట్టుగా ఎందుకు రాయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
అంతేకాదు.. నిమ్మగడ్డ వ్యవహారంలో ఏజీ మాట్లాడితే నిమ్మగడ్డ కంటే ముందుగా యనమల స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. టీడీపీ హయాంలో కేబినెట్ సమావేశాలన్నీ టెండర్లు ఖరారు చేయడం, బ్యాంకు గ్యారెంటీలకే సరిపోయాయని మండిపడ్డారు . రివర్స్ టెండర్ల ద్వారా మేం రూ.రెండు వేల కోట్లు ఆదా చేయడం బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కనిపించదా? అని సజ్జల ప్రశ్నించారు.
తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు 2014 – 2019 మధ్య గత ప్రభుత్వం బనాయించిన కేసులతో నలిగిపోయారని .. వారికి అండగా ఉంటామని సజ్జల ప్రశ్నించారు. రోడ్డు మీద తప్ప తాగి ప్రభుత్వాధినేతను దూషిస్తున్న వారి తరçఫున కేసులను వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉండగా సీఎం వైయస్ జగన్ కుటుంబ సభ్యులను చెప్పలేని విధంగా దూషించి దుష్ప్రచారం చేశారని అయినా ఆయన సహించారని గుర్తు చేశారు.