ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందరి లో కరోనా భయం కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి వైరస్ భారత దేశంపై కూడా పంజా విసురుతోంది. ఏకంగా భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. అయితే కరోనా  వైరస్ భారతదేశంలో ఎలా రూపాంతరం చెందింది అనే విషయంపై అసలు నిజాలు తెలుసుకునేందుకు... పరిశోధకులు ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఓ పరిశోధనలో సంచలన నిజాలు బయటపడ్డాయి... చైనా యూరప్ దేశాలలో వ్యాప్తిచెందిన మహమ్మారి కరోనా వైరస్  రూపాంతరం చెంది భారత్లోనూ ప్రస్తుతం విస్తృతంగా వ్యాపించినట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. 

 


 ఇలా రూపాంతరం చెందిన కరోనా వైరస్ భారతదేశంలో ఏకంగా   198 రకాలుగా రూపాంతరం చెందింది అంటూ సంచలన నిజాలు వెల్లడించారు. ఢిల్లీ గుజరాత్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో... ఈ మహమ్మారి వైరస్ ఎక్కువగా రూపాంతరం చెందినట్టుగా గుర్తించామని పరిశోధకులు వెల్లడించారు. అయితే అక్కడి శాస్త్రవేత్తలు ఇప్పటివరకు భారత్లో 400 జన్యు రాశులపై పరిశోధనలు జరపగ... వాటిలో ఏకంగా 198 వేరువేరుగా రకాల కరోనా  వైరస్ ను గుర్తించినట్టు తెలిపారు. అయితే భారత్లో ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందేందుకు ఏకంగా  198 రకాలుగా రూపాంతరం చెందిన తర్వాతే భారత్లో వ్యాపించింది అని అని అంటున్నారు.

 

 

 జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లో ఏకంగా ఏడుగురు శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం జరిపినట్లు వెల్లడించారు. కాగా ఇప్పుడు వరకు దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో 39 రకాలు, అహ్మదాబాద్లో 60 రకాలు, గాంధీనగర్ 13, తెలంగాణలో 55, కర్ణాటక మహారాష్ట్రలలో 15 రకాల కరోనా వైరస్ లను  గుర్తించామని తెలిపిన శాస్త్రవేత్తలు వీటి మూలాలు మాత్రం యూరప్ చైనా దేశాల నుంచే వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ కొత్త రకాలు తమకు అనుకూలంగా మార్చుకుని వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది అన్నది  తాజా పరిశోధనలో తేలిందని తెలిపారు. ఇక ఎలాంటి పరిస్థితుల్లో ఈ మహమ్మారి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందదు అనే విషయాలను కనుగొనేందుకు కొన్ని పరిశోధనలు జరుపుతున్నట్లు  జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: